Monday, December 8, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుశాసనసభ నిబంధనలకు తిలోదకాలు

శాసనసభ నిబంధనలకు తిలోదకాలు

- Advertisement -

రెండేండ్లు గడిచినా హౌస్‌ కమిటీల ఊసే లేదు : స్పీకర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

శాసన సభ నిబంధనలకు స్పీకర్‌ తిలోదకాలిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు బహిరంగ లేఖ రాశారు. శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడం,రూల్‌ 12 ప్రకారం అవసరమైనన్ని రోజులు సభను నిర్వహించడం లేదని పేర్కొన్నా రు. సరైన కారణాలు లేకుండా సభను తరచుగా వాయిదా వేయడం, జీరో అవర్‌ నిర్లక్ష్యం, ప్రశ్నోత్తరాల సమయాన్ని కుదించడం లాంటి చర్యల ద్వారా సభ్యుల హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. రెండేండ్లు గడిచినా అసెంబ్లీలో హౌస్‌ కమిటీలను ఏర్పాటు చేయలేదన్నారు. ఎస్టిమేట్స్‌ కమిటీ చైర్మెన్‌ రాజీనామా చేసినప్పటికీ, తిరిగి ఏర్పాటు చేయలేదని గుర్తుచేశారు. డిప్యూటీ స్పీకర్‌ను ఎందుకు నియమించలేదని లేఖలో ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. ఏడాదికి కనీసం 30 రోజులు అసెంబ్లీ నిర్వహించాలనీ, ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ నిర్వహణను సరిదిద్దాలనీ, అన్‌-స్టార్డ్‌ ప్రశ్నలకు గడువులోగా సమాధానాలు ఇవ్వాలనీ, .అన్ని హౌస్‌ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అలాగే డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలనీ, ప్రివిలేజ్‌ కమిటీని పునరుద్ధరించి పెండింగ్‌ అంశాలను పరిష్కరించాలనీ, సభలో నిబంధనలు, హుందాతనాన్ని పాటించాలనీ, పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై రాజ్యాంగం, చట్టం తోపాటు న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -