Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రపంచ దృక్కోణాన్ని మార్చిన అమెరికా: సీఎం రేవంత్‌ రెడ్డి

ప్రపంచ దృక్కోణాన్ని మార్చిన అమెరికా: సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతరం ఆవిష్కరణలను అందించడ మనే రెండు అంశాల్లో అమెరికా ప్రపంచ దృక్కోణాన్ని మార్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు. శుక్రవారం హైదరాబాద్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని వారికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందని చెప్పారు. అమెరికా ప్రపంచం ముందు అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించిందని గుర్తుచేశారు. ”ఓటమిని ఎప్పుడూ అంగీకరించని స్ఫూర్తి అమెరికాది. ఎల్లప్పుడూ బలమైన దేశంగా, అనేక అంశాల్లో ఒక సానుకూల మార్గంలో పరిష్కారాలను చూపగలిగింది. తెలంగాణ స్ఫూర్తికి..అమెరికా స్ఫూర్తికి ఎంతో సారూప్యత ఉంది. స్నేహాన్ని కోరుకోవడం, బంధాన్ని మరింత పటిష్ట పరుచుకోవడం తెలంగాణ ప్రత్యేకత. 2008లో ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం ఏర్పాటైంది. భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగు పరుచుకోవడంలో అమెరికా ఎంతో నిబద్ధతను ప్రదర్శించింది. అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహపూర్వకమైన బంధం ఎంతో బల మైంది. అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌ కాన్సూల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ రెండు సంస్కతుల మధ్య, ప్రజల మధ్య వాణిజ్యపరమైన సంబంధాలను పటిష్టపరచడంలో, ఇరు దేశాల మధ్య బలమైన వారధిగా నిలుస్తున్నారని” అభినందించారు.
అమెరికా-తెలంగాణల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగు పరచడానికి ప్రయత్నిస్తున్నట్టు సీఎం తెలిపారు. రాష్ట్రాన్ని 2035 నాటికి 1 ట్రిలియన్‌, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. ఈ విషయంలో అమెరికన్ల మద్దతు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. వ్యాపార, వాణిజ్య రంగాలు, పెట్టుబ డులు, ప్రజాస్వామ్యాన్ని విస్తృతం చేయడం, ప్రపంచ శాంతిని నెలకొల్పడం వంటి లక్ష్యాలతో స్నేహపూర్వక బలమైన సంబంధాలు కలిగి ఉండాలని అమెరికా, భారతదేశం కోరుకుంటున్నాయని తెలిపారు. అమెరికాలోని అత్యుత్త మైన వాటిని తెలంగాణకు తీసుకొస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -