వెనిజులా ఎప్పటికీ లొంగదు : ఆ దేశ అంతర్గత మంత్రి డియోస్టాడో కాబెల్లా
కారకాస్ : అమెరికా దురాక్రమణ దాడిలో సుమారు 100 మంది మృతి చెందారని, అందులోనూ ఎక్కువ మంది యువతేనని వెనిజులా అంతర్గత మంత్రి డియోస్టాడో కాబెల్లా బుధవారం స్పష్టం చేశారు. వెనిజులా ఎప్పటికీ లొంగిపోదని, ఈ దేశం చరిత్రాత్మక, వారసత్వం కలిగిన దేశమని అన్నారు. మదురో కిడ్నాప్ అనంతరం తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమితులైన డెల్సీ రోడ్రిగ్జ్‌కు తాము పూర్తి మద్దతునిస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికా దురాక్రమణ దాడి సమయంలో మదురో, ఆయనభార్య సిలియా ఫ్లోర్స్ ఇద్దరూ గాయపడ్డారని తెలిపారు. మదురో, సిలియాలను వెనక్కి తీసుకువచ్చేందుకు ప్రస్తుతం తాము యుద్ధం చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన అమెరికా దురాక్రమణ దాడిని, మదురోను యుద్ధ ఖైదీగా ముద్రవేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
అమెరికా దురాక్రమణ సైనిక లక్ష్యాలకే పరిమితం కాలేదని, పౌరులపై కూడా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిందని నిరూపించే సాక్ష్యధారాలు (వీడియో) తన వద్ద ఉన్నాయని డియోస్టాడో కాబెల్లా అన్నారు. వెనిజులా , క్యూబన్లతో సహా మరణించిన వారికి ఆయన నివాళులర్పించారు. వెనిజులా ప్రజలు మదురో, సిలియాలకు మద్దతుగా ఆందోళన చేపడుతున్నారని తెలిపారు. అమెరికా జోక్యం వెనుక వాస్తవం వెనిజులా సహజ వనరులను ముఖ్యంగా చమురును స్వాధీనం చేసుకోవడమేనని పునరుద్ఘాటించారు. సమస్య ప్రజాస్వామ్యం కాదని, సమస్య దేశ వనరులు అని పేర్కొన్నారు. మదురో కిడ్నాప్, సైనిక దురాక్రమణకు ప్రతిస్పందనగా ప్రపంచ దేశాలు పంపిన సంఘీభావ సందేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వెనిజులాలో శాంతికి హామీ బలీవియా విప్లవమేనని అన్నారు. నేడు వెనిజులాపై అమెరికా జరిపిన దాడి, ఎక్కడైనా, ఎప్పుడైనా జరగవచ్చని అన్నారు.
అమెరికా దురాక్రమణ దాడి…100 మంది మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



