Thursday, May 29, 2025
Homeరాష్ట్రీయంసీఎం ప్రజావాణిని సందర్శించిన అమెరికన్లు

సీఎం ప్రజావాణిని సందర్శించిన అమెరికన్లు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీఎం ప్రజావాణిని అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్తలు రాబర్ట్‌ హల్‌, శ్రీక్స్‌ సూగోడ్‌, చరణ్‌ గుంటీ సందర్శించారు. మంగళవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో జరిగిన సీఎం ప్రజావాణికి వచ్చిన అమెరికన్లు అక్కడి పని తీరును పరిశీలించారు. ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించడం హెల్ప్‌ డెస్క్‌ ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ప్రవాసి ప్రజావాణి డెస్క్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి ఇన్‌చార్జి చిన్నారెడ్డి, నోడల్‌ అధికారి దివ్య ప్రజావాణి నిర్వహణ తీరును వివరించారు. సీఎం ప్రజావాణితో ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారమవుతున్నాయనీ, పని తీరు ఎంతో బాగుందని అమెరికన్లు అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా అమెరికన్లను చిన్నారెడ్డి శాలువాతో సన్మానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -