ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం
రష్యా నుంచి చమురు కొంటే తీవ్ర చర్యలు
100 శాతం సుంకాలు వేస్తాం: యూఎస్ సెనేటర్ లిండ్సే హెచ్చరిక
వాషింగ్టన్ : భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా విషం గక్కింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. ”రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే ఇండియా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో ట్రంప్ విసిగిపోయారు. తక్కువ ధరకు దొరికే ఆయిల్ కొనుగోలు చేసి యుద్ధం కొనసాగించేందుకు సహకరిస్తున్న ఈ దేశాల ఆర్థిక వ్యవస్థను అమెరికా నాశనం చేస్తుంది. రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలను యూఎస్ టార్గెట్ చేసింది. ఈ దేశాలపై భారీగా సుంకాలు విధిస్తాము.” అని లిండ్సే ఓ ఇంటర్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై ట్రంప్ సుంకాలు విధించడం ఇతర దేశాలకు కూడా ప్రత్యక్ష హెచ్చరిక కాబోతుందన్నారు. యూఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం రిపబ్లికన్ పార్టీకి మద్దతు ఇచ్చే అమెరికన్ రాజకీయ నాయకుడు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు గట్టి మద్ధతుదారుగా గుర్తింపు ఉంది.
రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలపె 100 శాతం సుంకం కూడా విధిస్తామని లిండ్సే అన్నారు. ఇందులో ప్రధానంగా భారత్‌తో పాటు చైనా బ్రెజిల్ దేశాల పేర్లను కూడా చేర్చారు. ఈ దేశాలు రష్యా నుంచి వస్తువులు కొనుగోలు చేయడం ఆపకపోతే ఆదేశాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుందన్నారు. ఈ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉంటే యుద్ధం కూడా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి అలా జరగనివ్వం. రష్యా నుంచి చైనా, భారత్, బ్రెజిల్ అత్యధికంగా 80 శాతం చమురుని దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ దేశాలు రష్యా నుంచి ఇలా ఆయిల్ కొనుగోలు చేస్తే అది ఆ దేశం యుద్ధం కొనసాగించడానికి సహాయపడుతుందని లిండ్సే పేర్కొన్నారు.
నాటో దేశాలు కూడా భారత్, చైనా, బ్రెజిల్‌ను బెదిరించిన సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షున్ని ఆయా దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించేలా ఒప్పించాలని కోరాయి. ట్రంప్ ఇచ్చిన 50 రోజుల గడువు కూడా 2025 సెప్టెంబర్ 2 నాటికి పూర్తవుతుంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరకపోతే 100 శాతం సుంకాలు విధిస్తామని కూడా ట్రంపు హెచ్చరించారు. ఇప్పుడు సెనేటర్ లిండ్సే కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అధ్యక్షుడు ట్రంప్ 100 శాతం సుంకం విధించబోతున్నారన్నారు. ఈ మూడు దేశాలు రష్యా లేక అమెరికాల్లో ఏదో ఒక దేశాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుందని లిండ్సే పేర్కొన్నారు. తాము ఉక్రెయిన్‌కు ఆయుధాలను తరలిస్తున్నామని, అందువల్ల ఇకపై పుతిన్‌ను తిప్పికొట్టే ఆయుధాలు ఉక్రెయిన్ వద్ద ఉంటాయని అన్నారు.
భారత్‌పై అమెరికా విషం..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES