వెనిజులాపై సైనిక బెదిరింపులను ఖండించిన ఆసియా వామపక్ష పార్టీలు
న్యూఢిల్లీ : ఆసియా దేశాల్లోని వామపక్ష, కమ్యూనిస్టు పార్టీలు వెనిజులా ప్రజలకు సంఘీభావం ప్రకటించాయి. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. సైనికదాడులతో అమెరికా చేస్తున్న బెదిరింపులు, కరేబియన్ ప్రాంతంలో భారీగా సైనిక బలగాల ను మోహరించడం పట్ల ఆందోళనను వ్యక్తం చేశాయి. ”కరేబియన్‌లో జరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు, సామ్రాజ్యవాద అమెరికా.. వెనిజులా పై చేస్తున్న దౌర్జన్యం తక్షణమే ఆగాలి” అని డిమాండ్ చేశాయి. ఈ ప్రకటనపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేష న్, సోషలిస్ట్ పార్టీ ఆఫ్ మలేషియా, పార్టీ ఆఫ్ ది లేబరింగ్ మాసెస్ ఆఫ్ ఫిలిప్పీన్స్ (పీఎల్‌ఎం), ఇండోనేషియాకు చెందిన పార్టై పెంబెబాసన్ రాక్యాత్ వంటి పార్టీలు సంతకాలు చేశాయి. అమెరికా.. ఆగస్టు నుంచి కరేబియన్ ప్రాంతం లో యుద్ధ నౌకలను మోహరించి, 15వేల మందికి పైగా సైనికులను అక్కడ ఉంచిందని ఆరోపించాయి. ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికేనని అమెరికా అధ్యక్షు డు డోనాల్డ్ ట్రంప్ చెప్పినా.. ఇది వాస్తవానికి వెనిజులా ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమయ్యే చర్యగా వామపక్ష పార్టీలు అభివర్ణించాయి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వం డ్రగ్ కార్టెళ్లకు మద్దతిస్తున్నదని అమెరికా ఆరోపిస్తూ యుద్ధ బెదిరింపులకు దిగుతోందని పేర్కొన్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అమెరికా ఎలాంటి ఆధారాలూ చూపలేదని ప్రకటన స్పష్టం చేశాయి. డ్రగ్ రవాణా ఆరోపణల పేరిట వెనిజులా నౌకలను పేల్చి పలువురు పౌరుల ప్రాణాలను కూడా తీసిందని అమెరికాపై విమర్శలు గుప్పించాయి.
ప్రభుత్వ మార్పే యూఎస్ లక్ష్యం
ఇటీవల వెనిజులా నుంచి క్యూబాకు వెళ్తున్న చమురు ట్యాంకర్‌ను అమెరికా అక్రమంగా స్వాధీనం చేసుకోవడాన్ని పైరసీ చర్యగా లెఫ్ట్, కమ్యూనిస్ట్ పార్టీలు అభివర్ణించాయి. అలాగే వెనిజులాపై నావికా నిర్బంధం విధిస్తామని ట్రంప్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించాయి. ఈ సైనిక మోహరింపు, మాదకద్రవ్యాల వ్యతిరేక చర్యల పేరుతో వెనిజులాలో ప్రభుత్వ మార్పు చేయడమే అమెరికా లక్ష్యమని ఆరోపించాయి. వెనిజులా ప్రజలకు తమ సార్వభౌ మాధికారాన్ని రక్షించుకునే హక్కు ఉన్నదనీ, విదేశీ జోక్యం లేకుండా తమ అభివృద్ధి మార్గాన్ని తామే నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికి ఉండాలని ప్రకటనలో వివరించాయి. నికోలస్ మదురో నేతృత్వంలోని ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లను తట్టుకొని, దేశాన్ని మళ్లీ వలస పాలనకు లోను చేయాలనే ప్రయత్నాలను ఎదుర్కొంటామని స్పష్టంగా చెప్పిందని కూడా వామపక్ష పార్టీలు గుర్తు చేశాయి.
వెనిజులా చమురుపై నియంత్రణకు అమెరికా ప్రయత్నాలు
వెనిజులాలో నికోలస్ మదురో నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్నో ఏండ్లుగా అమెరికా విధిస్తున్న ఏకపక్ష శిక్షాత్మక చర్యలు (ఆంక్షలు) ఎదుర్కొంటోంది. ఈ ఆంక్షలకు అమెరికా కాలానుగుణంగా భిన్నమైన సమర్థనలతో ముందుకొస్తున్నది. ఇందులో భాగంగా వెనిజులా ప్రభుత్వంపై పలు ఆరోపణలకు దిగుతున్నది. వీటిని వెనిజులా ఎప్పటికప్పుడూ ఖండిస్తూ వస్తున్నది. అమెరికా ఉద్దేశం స్పష్టంగా ఉన్నది. మదురో నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని తొలగించడం, అలాగే అమెరికాకు అనుకూలమైన సంపన్న వర్గాల పాలనను మళ్లీ స్థాపించడమే దాని లక్ష్యమని వామపక్షాల సంయుక్త ప్రకటన వివరించింది. ఈ చర్యలన్నీ ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా భౌగోళిక-రాజకీయ (జియోపొలిటికల్) ప్రయోజనా లను సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలేనని పేర్కొన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వల్లో ఒకటైన వెనిజులా చమురుపై నియంత్రణ సాధించటం కోసం.. వెనిజులా చమురు ట్యాంకర్‌లను అమెరికా టార్గెట్ చేసుకుంటున్నదని వామపక్షాలు ఆరోపించాయి.
అమెరికా దౌర్జన్యం తక్షణమే ఆగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



