Monday, March 30, 2026
E-PAPER
Homeజాతీయంయుద్ధం సవాళ్ల వేళ ... తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : ప్రధాని మోడీ

యుద్ధం సవాళ్ల వేళ … తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు : ప్రధాని మోడీ

- Advertisement -

న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో గత నెల రోజులుగా కొనసాగుతోన్న యుద్ధం … ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లను సష్టించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 132 వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. మోడి మాట్లాడుతూ … ఈ మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కీలక ఘటనలు జరిగాయని అన్నారు. గతంలో కోవిడ్‌ కారణంగా ప్రపంచమంతా అనేక సమస్యలు ఎదుర్కొందని, దాని నుంచి బయటపడిన తర్వాత.. దేశాల మధ్య కొనసాగుతోన్న యుద్ధాలు పరిస్థితులను మార్చేశాయని తెలిపారు. ప్రస్తుతం అమెరికా- ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య కొనసాగుతోన్న యుద్ధం గురించి మాట్లాడారు. గల్ఫ్‌ దేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులకు సాయం అందిస్తున్న ఆయా ప్రభుత్వాలకు ఆయన కతజ్ఞతలు తెలిపారు. ఇంధన సరఫరాకు కీలకమైన ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ సంక్షోభం తలెత్తిందని వివరించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రజలందరూ ఐక్యతతో ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. సంక్షోభాన్ని రాజకీయం చేస్తున్నవారిని మోడి హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని.. ఇది 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన విషయమని అన్నారు. ఇక్కడ స్వార్థపూరిత రాజకీయాలకు తావు లేదని చెప్పారు. తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం చేసే ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -