Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేద కుటుంబానికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయం 

పేద కుటుంబానికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయం 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
పేద కుటుంబానికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సహాయాన్ని అందించి అండగా నిలిచిందని ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్ తెలిపారు. పాలకుర్తి గ్రామానికి చెందిన పెన్నం యాదమ్మ అనారోగ్యంతో బాధపడుతూ.. ఇటీవలే మృతి చెందడంతో శుక్రవారం అమ్మ చరిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యంతో పాటు నిత్యవసర సరుకులను అందజేశామని తెలిపారు. దాతల సహకారంతో పేదలకు, అనాధలకు అమ్మ చారిటబుల్ ట్రస్టు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి ఒర్రె కుమారస్వామి తో పాటు మృతురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -