Thursday, February 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘అమ్మ ఒడి’ కార్యక్రమం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ‘అమ్మ ఒడి’ కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్ ( రాజంపేట్ )
రాజంపేట్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ అధికారి విజయ మహాలక్ష్మి పలు గ్రామాల నుంచి వచ్చిన గర్భిణీ స్త్రీలను వైద్య చికిత్సలు నిర్వహించి రక్త పరీక్షలు, ఎత్తు, బరువు, రక్తపోటు వంటి వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య స్థితిని పరిశీలించారు. అనంతరం డాక్టర్ విజయ మహాలక్ష్మి గారు గర్భిణీలతో మాట్లాడుతూ గర్భధారణ సమయంలో తీసుకోవలసిన పౌష్టికాహార విలువలు, జాగ్రత్తల గురించి వివరించారు. ప్రతి గర్భిణీలు తప్పనిసరిగా రక్త పరీక్షలు, ముఖ్యంగా హెచ్.పి.ఎల్.సి పరీక్ష చేయించుకోవాలని, తద్వారా తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మంజూర్, స్టాఫ్ నర్స్ ఇందిరా, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -