నవతెలంగాణ – పెద్దవూర
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ) లో లెవల్ వరద కాల్వకు సోమవారం ఉదయం 6 గంటలకు గంటలకు ఏఎం ఆర్పీ ఇరిగేషన్ అధికారులు ఏఈ లు ఖదీర్, మల్లయ్య నీటినివిడుదల చేశారు. నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 588 అడుగులకు చేరడంతో నీటిని విడుదల చేసినట్లు ఏఎంఆర్పీ ఏఈ ఖదీర్ తెలిపారు. పై నుంచి ఇన్ భారీగా వస్తుండడంతో నీటి విడుదల చేశామని తెలిపారు.ఇప్పటికే దాదాపు చెరువులు అన్నీ నిండుగా వున్నాయని అందుకే 300 క్యూ సెక్కుల నీటిని దిగువ ఏఎం ఆర్పీ వరద కాలువకు విడుదలచేశామని తెలిపారు.రెండు రోజుల్లో చివరి వరకు నీళ్లు చేరుతాయని అన్నారు. నాన్ఆయకట్టు ప్రాంతానికి నీరందించే ఈ ప్రాజెక్టును తక్కువ ఖర్చుతో రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.లోలెవల్ వరదకాల్వ కింద నాగార్జునసాగర్, నల్లగొండ, మిర్యాలగూడ, నకిరేకల్ నియోజకవర్గాల్లోని ఏడు మండలాలకు పెద్దవూర, అనుముల, కనగల్, నిడమనూరు, వేములపల్లి, తిప్పర్తి, నకిరేకల్ మండలాలలో 80వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అదే విధంగా 200 చెరువులకు నీటిని నింపటంతోపాటు 250 గ్రామాలకు తాగునీరు అందించనుంది.
వరద కాలువకు నీటివిడుదల చేసిన ఏఎంఆర్పీ అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES