రియో డీ జెనైరో : బ్రెజిల్ అధ్యక్ష పదవికి ఆదివారం జరిగిన ఎన్నికలలో వామపక్ష నేత లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, సెనెటర్ ఫ్లావియో బోల్సొనారోలలో ఎవరికీ నిర్దేశిత ఓట్లు లభించకపోవడంతో వారిద్దరూ ఈ నెల ఇరవై ఐదవ తేదీన జరిగే తుది పోరుకు సిద్ధపడుతున్నారు. తొలి రౌండ్‌లో విజేతగా నిలిచేందుకు అవసరమైన యాభై శాతం ఓట్లను వీరు సాధించలేకపోయారు. తొలి రౌండ్‌లో బోల్సొనారోకు అంచనాలకు మించి ఓట్లు లభించాయి. చెల్లుబాటైన ఓట్లలో ఆయనకు 47 శాతం ఓట్లు రాగా అధ్యక్షుడు లూలాకు 45 శాతం ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు అనంతరం బ్రసిలియాలో బోల్సొనారో విలేకరులతో మాట్లాడుతూ బ్రెజిల్ మార్పును కోరుకున్నదని, ఫలితాలు తనకు సంతోషాన్ని కలిగించాయని చెప్పారు. లూలా నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ శకం ముగిసిందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా సావో పాలోలో మద్దతుదారులను ఉద్దేశించి లూలా ప్రసంగిస్తూ తొలి రౌండ్‌లో విజయం సాధిస్తానని ఆశించానని అన్నారు. రేపటి నుంచే కొత్తగా ప్రచారాన్ని ప్రారంభిస్తానని తెలిపారు. అధ్యక్షుడిగా తాను సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తానని లూలా చెప్పారు.
తుది రౌండ్ పోల్‌కు లూలా, బోల్సొనారో రెఢీ
43 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)