శ్రామికవర్గ రాజ్యం కోసం పోరాటాలు:
సంబు నారాయణమ్మ సంస్మరణ సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ -వీపనగండ్ల: కొంతమంది చేతుల్లోనే దేశ సంపద ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. సోమవారం యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రవి ప్రసాద్ గౌడ్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు జితేందర్ గౌడ్, రాంబాబు గౌడుల మాతృమూర్తి సంబు నారాయణమ్మ సంస్మరణ సభ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. నారాయణమ్మ చిత్రపటానికి జాన్ వెస్లీతో పాటు మాజీ ఎంపీ మధు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి రాజు, కోశాధికారి వరప్రసాద్, జేవీవీ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, సీనియర్ నాయకులు రాంరెడ్డి, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి కృష్ణయ్య, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు కృష్ణ, గద్వాల జిల్లా అధ్యక్షులు రమేష్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ వెంకటేష్, ,రవికుమార్, సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి పలువురు నాయకులు, సర్పంచ్‌లు జంబులయ్య, నిరంజన్, డి కవిత పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ నారాయణమ్మ తమ ఇంటిని ఉద్యమానికి కేంద్రంగా మార్చి, ఎంతోమంది కార్యకర్తలు తయారు కావడానికి కేంద్రంగా పని చేసిందన్నారు.
పార్టీ కార్యక్రమాలలో సహకరిస్తూ తమ పిల్లలను సమాజ అభివృద్ధి కోసం, ప్రజా ఉద్యమానికి వెన్నంటి ప్రోత్సహించారని అన్నారు. అసమానతలు, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరుస్తూ పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
కరువు పెన్షన్లు మంజూరు చేసిన ఘనత సీపీఐ(ఎం)దే : మాజీ ఎంపీ మధు
కరువు పెన్షన్లు మంజూరు చేయించడంలో సీపీఐ(ఎం) ఘనమైన పాత్ర పోషించిందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ మధు అన్నారు. నారాయణమ్మ మరణం కుటుంబానికి తీరని లోటు అన్నారు. కరువు సమయంలో అంబలి కేంద్రాలు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీర్చిన ఘనత సీపీఐ(ఎం)కు దక్కిందన్నారు. కరువు సంభవిం చినప్పుడు పార్టీ ఆందోళన పోరాటాల్లో భాగంగా గుమ్మడం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హాజరై 75 రూపాయల కరువు పెన్షన్ మంజూరు చేశారని చెప్పారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వర్, రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లాడుతూ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా శాస్త్రీయ ధృక్పథం, ప్రశ్నించేతత్వాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు.
కొంతమంది చేతుల్లోనే దేశ సంపద
52 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)