Magazines

అర్హుల ఓటు చేజారనివ్వం

1 గంట క్రితం

Eligible Voters
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 2 నిమిషాల చదవడం

రాష్ట్రంలో రాబోయే రెండు నెలలూ ఓటు పరిరక్షణ ఉద్యమం : పీసీసీ చీఫ్ మహేశ్‌‌కుమార్ గౌడ్‌

‌నేడు, రేపు జిల్లాల్లో నిరసన ర్యాలీలు
8న ‘చలో రాజ్‌భవన్’

గ్రామ స్థాయి 
నుంచి పీసీసీ వరకు ఆందోళనా కార్యక్రమాలు

కార్యకర్త నుంచి మంత్రుల దాకా అందరూ పాల్గొనాల్సిందే

సర్ అక్రమాలు, ఓట్ల తొలగింపు నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో ​
తెలంగాణలో అర్హులైన ఏ ఒక్కరి ఓటునూ చేజారనివ్వబోమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఓట్లు గల్లంతైన బాధితులను ఏకం చేసి ఓటర్ల హక్కుల పరిరక్షణకు ఉద్యమం చేపడతామని వెల్లడించారు. ఈ దిశలో రాష్ట్రంలో రాబోయే రెండు నెలల పాలు ఓటు పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. స్పెషల్ ఇంటెన్సీవ్‌ రివిజన్ (సర్) అక్రమాలపై కూడా కాంగ్రెస్ పోరాటం కొనసా‌గుతుందన్నారు. సర్ ప్రక్రియలో అవకతవకలు, ఓట్ల తొలగింపుపై సోమవారం ఇందిరా భవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేతల సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగినట్టు తెలిపారు. సర్ అక్రమాలపై రానున్న రెండు నెలల పాటు నిరంతరం కార్యక్రమాలు జరపాలని నిర్ణయించినట్టు చెప్పారు. అలాగే అర్హత కలిగిన ప్రతి ఓటరు హక్కును కాపాడుతామన్నారు. ఈ లక్ష్యంతో గ్రామ స్థాయి నుంచి పీసీసీ స్థాయి వరకు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. ఓట్లు గల్లంతైన వారి ఓట్లను పరిరక్షించుకునే విధంగా... తెలంగాణలోని ప్రజా సంఘాలు, ఎన్జీవోలు, కుల సంఘాలకు పీసీసీ తరపున లేఖలు రాస్తామని తెలిపారు. ప్రధానంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కు వ్యతిరేకంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మోడీ ,అమిత్ షా ఒత్తిడితోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సర్ ప్రక్రియలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ...సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


రాష్ట్రంలో 92 లక్షల ఓట్లు తొలగింపు
సర్ పేరిట తెలంగాణలో దాదాపు 92 లక్షల ఓట్లు తొలగించారని పీసీసీ చీఫ్‌ ‌మహేశ్‌‌కుమార్‌ ‌గౌడ్‌ ఆరోపించారు. అయితే... అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని రాహుల్ గాంధీ దిశా నిర్ధేశం చేశార‌ని తెలిపారు. ఆయన సూచనల మేరకు ప్రజల్లో అవగాహనా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. నేడు, రేపు (ఈనెల 6, 7 తేదీల్లో) తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్థాయి నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. ఈ ర్యాలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. అలాగే 8న ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్