Magazines

విద్యా వికాసానికి మాతృభాషే మూలం

49 నిమిషాల క్రితం

The mother tongue is the foundation of educational development.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

సమగ్ర విద్యాభివృద్ధికి మాతృభాషలో 
బోధన కీలకం : తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి
సారస్వత పరిషత్‌‌లో భాషోపాధ్యాయ సంస్థ రాష్ట్ర విద్యా సదస్సు
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌ ​
విద్యా వికాసానికి మాతృభాషే మూలమని, సమగ్ర విద్యాభివృద్ధికి మాతృభాషలో విద్యాబోధన కీలకమని తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి తెలిపారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సారస్వత పరిషత్‌లో సోమవారం ‘మాతృభాషకు భాషాంజలి’ పేరుతో రాష్ట్రస్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ‘తెలుగు సాహిత్యం-యువత-ఈ శతాబ్దపు కవిత్వం’ తదితర అంశాలపై చర్చించారు. డాక్టర్‌ లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్య వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా మాతృభాష అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మాతృభాష కేవలం భావ ప్రకటనకే పరిమితం కాదని, మానవీయ విలువలు, నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రేరణనిస్తుందని తెలిపారు. అనంతరం ‘ఐశ్వర్య ప్రదాయిని-తెలుగు’ అంశంపై రివెళ్ల రాఘవేంద్ర ప్రసంగించారు. మాతృభాష తెలుగులో విద్యనభ్యసించిన వారికి అన్ని రంగాల్లోనూ రాణించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక తదితర రంగాల్లో విద్యార్థులు రాణించేందుకు మాతృభాషా విద్య దోహదపడుతుందన్నారు.‘మాతృభాష బోధన-ఉపాధ్యాయుని పాత్ర’ అనే అంశంపై ఓయూ ప్రొఫెసర్‌ రఘు ప్రసంగిస్తూ.. విద్యార్థుల మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే విధంగా మాతృభాషా బోధన సాగించాలని సూచించారు. మాతృభాషలో బోధన విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించేలా ఉండాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రెం గౌరీశంకర్‌రావు, గౌరవ అధ్యక్షులు చౌడవరం చంద్రమోహన్‌, వ్యవస్థాపకులు పెండ్యాల బ్రహ్మయ్య, రాష్ట్ర బాధ్యులు డా. షేక్‌ వలీ శ్రీనూరాన్‌, కాంధ్ర సురేంద్రనాథ్‌, గుండురవి, కానుగుల ద్రయ్య, మర్రిపల్లి రమేష్‌, బషీర్‌, అనిల్‌, డా. మెదలత్‌ ఇమామ్‌, బండారు కృతీశ్‌, అమర్‌, దయాకర్‌, పరియోర్ల, శ్రీనివాస్‌, జగదీశ్‌, శ్రీనివాసమూర్తి, సీతికొండేశ్వర్‌, ఎన్‌.వి. శ్రీదేవి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్