Magazines

స్పెయిన్ లో రెండు హైస్పీడ్ ట్రైన్స్ ఢీ

3 గంటల క్రితం

collide
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 3 నిమిషాల చదవడం

64 మంది మృతి .. కొనసాగుతున్న సహాయక చర్యలు

మాడ్రిడ్ : స్పెయిన్‌ టోలెడో ప్రావిన్స్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 64 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మూడు బోగీలు పట్టాలు తప్పగా, రెండు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారుఈ ఘటనపై స్పెయిన్ ప్రధానమంత్రి స్పందించారు. స్పెయిన్‌ రైల్వే నిర్వహణ సంస్థ ఏడీఐఎఫ్‌ తెలిపిన వివరాల

ప్రకారం, దేశంలోని మధ్య ప్రాంతమైన టొలెడో ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం మాడ్రిడ్‌ నుంచి నైరుతి ప్రాంతంలోని సెవిల్లెకు వెళ్తున్న రెండు హైస్పీడ్‌ రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయి.


వీటిలో ఒక రైలు ఆగి ఉండగా, వెనుక నుంచి వచ్చిన మరో రైలు దాని వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బోగీలు పట్టాలు తప్పాయి. ఢీకొన్న తీవ్రతకు ఓ బోగీ పూర్తిగా ధ్వంసమై, దాని విడిభాగాలు సమీపంలోని వాలులో చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రెండు రైళ్లలో కలిపి 500 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. మూడు బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మూడు హెలికాప్టర్లు, రెండు మొబైల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లను ఘటనా స్థలినికి పంపినట్టు ఓ అధికారి వెల్లడించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు స్పోర్ట్స్ పెవిలియన్‌ను సిద్ధం చేశామని ఉర్డా మేయర్ తెలిపారు.

రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఈ ప్రమాదంతో మాద్రిద్ -అండలూసియా మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రయాణికులకు అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఐఆర్‌వో సంస్థ కూడా తన భద్రతా ప్రోటోకాల్‌లను అమల్లోకి తెచ్చి, అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన రైళ్లలో ఒకటి ప్రభుత్వ రంగ సంస్థ రెన్ఫేకు చెందినది కాగా, మరొకటి ప్రయి వేటు సంస్థ ఐఆర్‌వోకు చెందినది. రెన్ఫే రైలులో 397 మంది, ఐఆర్‌వో రైలులో 147 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.స్పెయిన్‌ ఆరోగ్యశాఖ మంత్రి మోనికా గార్సియా తెలిపిన వివరాల ప్రకారం, అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న రెండు బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడంపై సహాయక బృందాలు దృష్టి సారించాయి. క్షతగాత్రులను సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఢీకొన్న వేగం, తీవ్రతను బట్టి చూస్తే ఇది పెను విషాదంగా మారే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అత్యవసర సేవల బృందాలతో పాటు సైనిక అత్యవసర విభాగాన్ని కూడా ప్రమాద స్థలానికి పంపించారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ఉర్దా పట్టణంలోని క్రీడా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.

ప్రధాని దిగ్భ్రాంతి

ఈ ఘటనపై స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై దృష్టి సారించేందుకు తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. బాధితులకు సహాయం అందించేందుకు అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలంలో పనిచేస్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. కాస్టిల్లా-లా మాంచా ప్రాంత అధ్యక్షుడు ఎమిలియానో గార్సియా-పేజ్‌ కూడా ప్రమాద స్థలానికి బయలుదేరినట్టు వెల్లడించారు.

ఈ ఏడాది రెండో భారీ రైలు ప్రమాదం

స్పెయిన్‌లో ఈ ఏడాది జరిగిన రెండో పెద్ద రైలు ప్రమాదం ఇది. జనవరిలో దక్షిణ స్పెయిన్‌లో రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొన్న ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో జరిగిన రైలు ప్రమాదంలో 80 మంది మృతి చెందగా, ఆ తర్వాత దేశంలో అత్యంత ప్రాణాంతకమైన రైలు ప్రమాదాల్లో జనవరి ఘటన ఒకటిగా నిలిచింది. తాజా ప్రమాదంతో స్పెయిన్‌ హైస్పీడ్‌ రైలు వ్యవస్థ భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్