Magazines

కెనడాను ముక్కలు చేయాలన్నదే అమెరికా కుట్ర

2 గంటల క్రితం

America's conspiracy
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

తద్వారా తమ గుప్పెట్లోకి తీసుకునే యత్నం : కెనడా ప్రధాని మార్క్‌ ‌కార్నీ సంచలన వ్యాఖ్యలు

టోరంటో : కెనడాను ముక్కలు చేసి తమ గుప్పె ట్లోకి తీసుకునేందుకు అమెరికా యత్నిస్తోందని కెనడా ప్రధాని మార్క్‌ కార్నీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సహజ వాయువు, చమురుతో సుసంపన్నమైన ఆల్బెర్టా ప్రావిన్సు కెనడా నుంచి విడిపోవాలా వద్దా’ ? అనే అంశంపై సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రసంగించిన మార్క్‌ కార్నీ కెనడాలోనే ఆల్బెర్టా ప్రావిన్సు కొనసాగేలా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అస్థిరత నెలకొన్న సమయంలో దేశ సరిహద్దులకు అవతల ఉన్న ఓ శక్తి కెనడాను విడగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఈ వేర్పాటుకు ప్రజలు ఓటేస్తే ఏండ్ల తరబడి తీవ్ర అనిశ్చితికి దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. ఆల్బెర్టా వనరులపై గత ప్రభుత్వ నిర్ణయాలు స్థానికుల్లో అసంతృప్తి కలిగించిన మాట వాస్తవమేనని మార్క్ కార్నీ అంగీకరించారు. కెనడాను 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామన్న ట్రంప్ బెదిరింపులకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. ఇలాంటి ఒత్తిళ్లను తట్టుకోవడానికే పసిఫిక్ లింక్ పైప్‌లైన్ ప్రాజెక్టును తెస్తున్నామని స్పష్టం చేశారు. దీని ద్వారా 1.40 లక్షలకు పైగా ఉద్యోగాలు రావడంతో పాటు, చమురు ఎగుమతుల కోసం అమెరికాపై ఆధారపడే అవసరం తప్పుతుందని వివరించారు. సోమవారం నాటికి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని కెనడా అనుకూల వాలంటీర్లను ప్రధాని కోరారు. ‘‘ ఈ ప్రజాభిప్రాయ సేకరణకు ఇంతకంటే చెత్త సమయం మరొకటి ఉండదు. మన సరిహద్దులకు అవతల ఉన్నవారు మనల్ని విచ్ఛిన్నం చేసి, గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన, విభజన పూరిత వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి సమయంలో మనమంతా ఏకమై, ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి’’ అని ప్రధాని మార్క్‌ ‌కార్నీ అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్