వచ్చే నెలలో గోల్ఫ్ కోర్స్ పనులు ప్రారంభిస్తాం : ట్రంప్
వాషింగ్టన్ : చారిత్రక వాషింగ్టన్ గోల్ఫ్ కోర్స్ పునర్నిర్మాణ పనుల విషయంలో ముందస్తు కోర్టు నోటిఫికేషన్ లేకుండా ముందుకు వెళ్లవద్దంటూ ఫెడరల్ జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బేఖాతరు చేస్తున్నారు. కోర్టు చెబితే మాత్రం వింటానా అంటూ హూంకరిస్తున్నారు. వచ్చే నెలలో తన ప్రభుత్వం గోల్ఫ్ కోర్స్ పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తుందని ప్రకటిం చారు. పునర్మిర్మాణ పనులు సెప్టెంబ రులో ప్రారంభం అవుతాయని ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ చెప్పారు. అయితే పర్యావరణ, చారిత్రక సంరక్షణ విషయంలో వ్యక్తమైన ఆందోళనల కారణంగా ఈ వ్యవహారం కోర్టు ముందుకు వచ్చింది. ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఆదివారం ఉదయం ఓ పోస్ట్ పెడుతూ ఈస్ట్ పొటోమాక్ గోల్ఫ్ లింక్స్ పనులు నవంబర్ 15న మొదలవుతాయని, పదిహేను నెలల్లో దానిని తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. గోల్ఫ్ కోర్స్‌ను పర్యవేక్షించే ఇంటీరియర్ విభాగం తాజా పునర్మిర్మాణ పనుల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తోందని ఆయన వివరించారు. వైట్‌హౌస్‌లోనూ, వాషింగ్టన్‌లోని ఇతర కట్టడాలలోనూ మార్పులు చేయిం చేందుకు ట్రంప్ అనేక ప్రాజెక్టులు చేపట్టారు. వీటిలో గోల్ఫ్ కోర్స్ పునర్ని ర్మాణం ఒకటి. అయితే గోల్ఫ్ కోర్సులో చేపట్టే ఏ నిర్మాణ పనికైనా ప్రభుత్వం ముందుగా నోటీసు ఇవ్వాలని యూఎస్ జిల్లా జడ్జి అనా రేయాస్ గతంలో రూలింగ్ ఇచ్చారు. ఆ ప్రదేశంలో చెట్ల తొలగింపును నిలిపివేస్తూ గత వారం ఓ ఆదేశాన్ని కూడా జారీ చేశారు. కాగా ట్రంప్ పోస్ట్ చూసిన తర్వాత ఆమె ప్రభుత్వానికి తాజా ఆదేశాలు జారీ చేస్తూ గత వారం న్యాయస్థానాఁకి తెలియజేసిన వైఖరిలో ఏమైనా మార్పు ఉన్నదీ లేనిదీ తెలియజేయాలని సూచించారు.






కామెంట్‌లు (0)