ఒహాయో ర్యాలీలో ట్రంప్ బెదిరింపులు
వండాలియా : రాబోయే మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లు గెలిస్తే ఆర్థిక సాయం అందిస్తానని, అదే డెమొక్రాట్లు విజయం సాధిస్తే తన సాయం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒహాయోలో జరిగిన ర్యాలీలో ఆయన డెమొక్రాట్లపై దూషణలకు దిగారు. 'బయటికి వచ్చి ఓటేయండి. మీరు అలా చేస్తే మేము గెలుస్తాం. భారీ మెజారిటీ సాధిస్తాం. వాళ్ల పని పడతాం' అని అన్నారు. సెనెటర్ జాన్ హస్టెడ్, ఒహాయో గవర్నర్ అభ్యర్థి వివేక్ రామస్వామి సహా రిపబ్లికన్ అభ్యర్థుల విజయం కోసం ఏర్పాటు చేసిన ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. హాస్టెడ్, రామస్వామి తమ డెమొక్రాట్ ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారు. మధ్యంతర ఎన్నికలలో ఒహాయో కీలక పాత్ర పోషించబోతోంది. డెమొక్రాట్లకు ఆధిక్యత లభిస్తుందని పలు సర్వేలు చెబుతున్నప్పటికీ విమర్శకులు ఊహిం చిన దారి కంటే మెరుగైన ఫలితాలు సాధి స్తామని ట్రంప్ చెప్పారు. పోటీ తీవ్రంగా ఉన్న ఎనిమిది సెనెట్ రేసులలో ఒహాయో ఒకటి.
డెమొక్రాట్లపై తిట్ల దండకం
ట్రంప్ తన ప్రసంగంలో డెమొక్రాట్లను పరుష పదజాలంతో దూషించారు. వారిని 'బుద్ధిహీనులైన కుక్క కొడుకులు'గా అభివర్ణించారు. రాష్ట్రంలో రిపబ్లికన్లు ఎన్నికైతే నిధుల కోసం తరచుగా తనకు ఫోన్ చేస్తారని, ఒకవేళ డెమొక్రాట్లు గెలిస్తే వారికి అనుకూలంగా వ్యవహరించడానికి తాను ఇష్టపడకపోవచ్చునని చెప్పారు. డెమొక్రాట్ అభ్యర్థి యాక్టన్ గెలిస్తే ఆమెకు సాయపడబోనని స్పష్టం చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్కు ఒహాయో రాష్ట్రంలో 55 శాతానికి పైగా ఓట్లు లభించాయి. అయితే ప్రజలలో నెల కొన్న ఆర్థిక పరమైన ఆందోళనల కారణంగా ప్రస్తుతం ఆయన రేటింగ్ పడిపోయింది.
డెమొక్రాట్లు గెలిస్తే సాయం చేయను
05 అక్టోబర్, 2026
Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)