పూర్తి చేయాల్సిన పనులు మాకూ ఉన్నాయి
అమెరికాను హెచ్చరించిన అరాగ్చీ
టెహ్రాన్ : తమపై మరోసారి దాడులు జరిపితే ఊరుకునే ప్రసక్తే లేదఁ ఇరాన్ స్పష్టం చేసింది. తమకూ కొన్ని అసంపూర్తి పనులు ఉన్నాయని హెచ్చరించింది. మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై తిరిగి దాడులు ప్రారంభిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ 'పని పూర్తి చేయాలని పోయిన సారే మీరు అనుకున్నారు. కానీ ఇరాన్ మరింత బలోపేతమైంది. మీ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోవాలని అనుకుంటున్నారా ? మాకు అతిథిగా రండి. కానీ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మేము చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి' అని ఆయన ఆదివారం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో రాశారు. ఎలాంటి పరిణామాలు ఎదురైనప్పటికీ జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ అమెరికాను మరో యుద్ధంలోకి నెడుతున్నారని అరాగ్చీ మండి పడ్డారు. కాగా సెప్టెంబరులో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ప్రతిపాదనకు అమెరికా కట్టుబడితే హార్ముజ్ జలసంధిని కొద్ది రోజుల్లోనే తెరుస్తామని అరాగ్చీ గతంలో ప్రతిపాదించారు. అయితే దీనిని ట్రంప్ తోసిపుచ్చారు.






కామెంట్లు (0)