Magazines

రష్యాలో భారీ భూకంపం..6.9 తీవ్రత

3 గంటల క్రితం

earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : రష్యాలోని కమ్చట్కా ప్రాంతం, ఓజెర్నోవ్‌స్కీ సమీపంలో శుక్రవారం 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.36 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనలు ఒక నిమిషం పాటు కొనసాగాయి. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూకంపం భూమి ఉపరితలం కింద చాలా లోతులో సంభవించడం వల్ల సునామీ ముప్పు లేదని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, జియోఫిజికల్ సర్వీస్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్