Magazines

భద్రతా వైఫల్యాలపై వివరణ ఇవ్వండి

1 గంట క్రితం

security failures
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన ఫ్రాన్స్‌ మేయర్లు

పారిస్‌ : దేశంలో గత వారాంతంలో జరిగిన అల్లర్లు, లూటీలను అడ్డుకోవడంలో భద్రతా దళాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ప్రధాన నగరాల మేయర్లు ఆరోపించారు. దీఁపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాగా భద్రతా వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసేందుకు ఆంతరంగిక వ్యవహారాల మంత్రి లారెంట్‌ నునెజ్‌ సిద్ధపడ్డారని, అయితే అందుకు దేశాధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌ అంగీకరించలేదని ఆయన కార్యాల యం సోమవారం తెలిపింది. బారికేడ్లను తొలగించాలని, లూటీలు జరగకుండా చూడాలని, నిఘా వ్యవస్థ వైఫల్యాలపై పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రికి సూచించారని వివరించింది. 'ప్రదర్శనలు, నిరసనలు మాకు అలవాటే. కానీ శనివారం తొలిసారిగా మా నగరాల్లోని కొన్ని ప్రాంతా లకు రక్షణ అనేదే లేకుండా పోయింది. ఇప్పు డు మనం మన నగరాలకు తగిలిన గాయా లకు మందు పూయాలి. అంతేకాక ఈ స్థాయిలో జరిగిన హింసను చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కో వాలి' అని లిబరేషన్‌ పత్రికలో రాసిన సంయుక్త సంపాదకీయంలో పారిస్‌, మార్సె యిల్‌, లియోన్‌ మేయర్లు తెలియ జేశారు. ఇదిలావుండగా పాఠశాలలకు సోమవారం నుంచి సెలవులు ప్రారంభం కావడం ప్రభుత్వానికి కొంత ఊరట ఇచ్చినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ప్రదర్శనలు, సమావేశాలను నిషేధించింది. మరోవైపు వచ్చే నెల ఐదవ తేదీన సార్వత్రిక సమ్మెకు, నిరసనలకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్