Magazines

బ్రెజిల్‌లో ముగిసిన రన్-ఆఫ్ పోలింగ్

4 గంటల క్రితం

Brazil
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

పుంజుకున్న లూలా

బ్రెసిలియా : బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల రన్ - ఆఫ్ (రెండో రౌండ్) పోలింగ్ ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగింది. ప్రస్తుత వామపక్ష అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కుమారుడు, సెనెటర్ ఫ్లావియో బోల్సొ నారో మధ్య హోరాహోరీ పోరు నడిచింది. తొలి రౌండ్‌లో ఫ్లావియోకు 47.03 శాతం (5.61 కోట్ల ఓట్లు), లూలాకు 45.16 శాతం (5.38 కోట్ల ఓట్లు) ఓట్లు లభించాయి. ఏ అభ్యర్థికీ స్పష్టమైన మెజారిటీ ...అంటే పోలైన ఓట్లలో యాభై శాతం రాకపోవడంతో ఆదివారం రన్ - ఆఫ్ ఓటింగ్ నిర్వహిం చారు. పోలింగ్‌కు ముందు నిర్వహించి న చివరి సర్వేలలో ఇద్దరు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తేలింది. చివరి రోజుల్లో లూలా పుంజుకొని బోల్సొనారోతో సమానంగా నిలిచారని అంచనాలు చెబుతున్నాయి. బ్రెజిల్‌లో ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తుండడంతో పోలింగ్ ముగిసిన కొద్ది గంటల వ్యవధిలోనే సుపీరియర్ ఎలక్టొరల్ కోర్ట్ (టీఎస్‌ఈ) ద్వారా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్