- Advertisement -
నవతెలంగాణ – టేకుమట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల నూతన ఎస్సైగా జి అమూల్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఎస్సై దాసరి సుధాకర్ బదిలీపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో అమూల్య ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై అమూల్య మాట్లాడుతూ.. మండలంలో ఆసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని అన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా సంప్రదించాలని సూచించారు.
- Advertisement -



