హెచ్‌ఎమ్‌డీఏ ఆధ్వర్యంలో నియోపోలీస్ ఈ-ఆక్షన్
రికార్డు స్థాయిలో వేలం
గతం కంటే 87శాతం పెరిగిన ధర
నవతెలంగాణ-హైదరాబాద్ (హెచ్‌ఎమ్‌డీఏ)
హెచ్‌ఎమ్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన నియోపోలీస్ ఈ – ఆక్షన్‌కు భారీ స్పందన వచ్చింది. అధికారులు సైతం ఊహించని విధంగా ఎకరం రూ.137. 25కోట్లు పలికింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి దశలో భాగంగా మొత్తం రెండు పాట్లు.. 10.30 ఎకరాలకు వేలం నిర్వహించారు. ప్లాట్ 17లో 4.59 ఎకరాలు, ప్లాట్ 18లో 5.31 ఎకరాలను ఈ ఆక్షన్‌లో పెట్టారు. ఈ వేలంలో 10 ప్రముఖ కంపెనీలు పోటీ పడ్డాయి. ఇందులో ఒక ఎకరం రూ.137.25కోట్లు పలికింది. మొత్తం రెండు పాట్లు 10.30 ఎకరాలకుగాను ప్రభుత్వానికి రూ.1,356 కోట్ల ఆదాయం వచ్చింది. గతంతో పోల్చి చూస్తే 87శాతం పెరిగింది. 2023లో జరిగిన నియోపోలీస్ ఆక్షన్లలో సగటు ధర ఎకరాకు సుమారు రూ.73 కోట్లు పలికింది. ఈ సారి ఎకరం రూ.137.25కోట్లు పలికింది. ప్లాట్ 18ని ఎమ్‌ఎస్‌ఎన్ అర్బన్ వెంచర్స్ సొంతం చేసుకోగా, ప్లాట్ 17ను వజ్రా హౌసింగ్ ప్రాజెక్ట్స్ సొంతం చేసుకుంది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి 2గంటల వరకు జరగాల్సిన వేలం.. పోటీ ఎక్కువగా ఉండటంతో సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది.
కోకాపేటలో ఎకరం రూ.137.25 కోట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



