Tuesday, March 31, 2026
E-PAPER
Homeసినిమాక్రేజీ కాంబోలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

క్రేజీ కాంబోలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం రేపే ఓ భారీ అనౌన్స్‌మెంట్‌ను సల్మాన్‌ ఖాన్‌, వంశీ పైడిపల్లి, దిల్‌ రాజు సోషల్‌ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.ఈ క్రేజీ కాంబోలో రూపొందబోయే సినిమా వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
బిగ్‌ స్కేల్‌ ఎంటర్‌టైనర్స్‌ను ఎమోషన్స్‌తో మేళవిస్తూ చిత్రాలను రూపొందించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు వంశీ పైడిపల్లి. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, విజయ్ వంటి అగ్ర హీరోలతో పని చేసి, విభిన్న జోనర్స్‌లో తన ప్రతిభను నిరూపించుకున్నారు.

ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ జాతీయ అవార్డు సాధించడం ఆయన విజన్‌కి నిదర్శనం. దిల్‌ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై 60కి పైగా చిత్రాలను నిర్మించిన కంటెంట్‌, కమర్షియల్‌ విజయాలతో సక్సెస్‌ఫుల్‌గా నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ‘మహర్షి’, ‘శతమానం భవతి’ చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకోవడం ఆయన క్యాలిటీకి నిదర్శనం. ఇక మూడు దశాబ్దాల కెరీర్‌లో సల్మాన్‌ ఖాన్‌ ‘దబాంగ్‌, బాడీగార్డ్‌, రెడీ టు కిక్‌, బజరంగీ భాయిజాన్‌, సుల్తాన్‌, ఐకానిక్‌ ‘టైగర్‌’ ఫ్రాంచైజీ వంటి అనేక బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో భారీ విజయాలు సాధించారు. ఈ సక్సెస్‌ఫుల్‌ త్రయం చేయబోయే సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్‌ త్వరలోనే ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -