జాజుల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 31న హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు బీసీ జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చర్చించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చర్చించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో చేసిన చట్టం అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ రూపొందించకుండా కొత్త నాటకం ఆడుతున్నారని జాజుల విమర్శించారు.
బీసీ రిజర్వేషన్లపై 31న అఖిలపక్ష సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



