Friday, March 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలు'దృశ్యం'లాంటి అద్భుత థ్రిల్లర్‌

‘దృశ్యం’లాంటి అద్భుత థ్రిల్లర్‌

- Advertisement -

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్‌ ‘కామాఖ్య’. మై ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్‌, యశ్వంత్‌ రాజ్‌ నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా టీజర్‌ని లాంచ్‌ చేశారు. సముద్రఖని మాట్లాడుతూ,’ఈ సినిమా టైటిల్‌ ‘కామాఖ్య’ అని చెప్పగానే మరో ఆలోచన లేకుండా చేసేద్దాం అని చెప్పాను. ఆ పవర్‌ నాకు తెలుసు. నా కెరీర్‌లో ఒక ప్రాజెక్ట్‌ విషయంలో చాలా ఆలస్యం అయింది. ఆ సమయంలో అమ్మవారి దర్శనం కోసం వెళ్లాను. అక్కడ ఓ ఋషి నన్ను పేరుతో పిలిచి మాట్లాడారు. ఆ సందర్భంలో నా ప్రాజెక్ట్స్‌ సంగతి చెప్పాను. దర్శనం చేసుకొని వెళ్ళు, అయిపోతుంది అన్నారు. తమిళనాడులో ల్యాండ్‌ అయిన వెంటనే హీరోతో మీటింగ్‌ అనే మెసేజ్‌ వచ్చింది.

అది అమ్మవారి పవర్‌. సినిమా రిలీజ్‌ అయిన తర్వాత మళ్ళీ అక్కడి వెళ్లి అన్నదానం చేసి వచ్చాను. సరిగ్గా ఆరు నెలలకి అభి ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పారు. చేసేద్దాం అన్నాను. ఇది ఎక్స్‌ ట్రార్డినరీ మూవీ’ అని తెలిపారు. ‘ఇది నేను దర్శకత్వం వహించిన రెండో చిత్రం. మొదటి చిత్రం ‘చిరంజీవా’. ఆ చిత్రంలో యమధర్మరాజుకి ఒక గుడి ఉందని, అది తెలంగాణలోనే ఉందని చెప్పడం జరిగింది. కామాఖ్య అమ్మవారి నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఒక ఉత్కంఠభరితంగా ప్రజెంట్‌ చేస్తూ మీ ముందుకు తీసుకు వస్తున్నాం. నా స్నేహితుడు రిశాంక్‌, బాహుబలికి పనిచేస్తున్నప్పుడు సెంథిల్‌ దగ్గర పరిచయమైన రమేష్‌.. మేము ముగ్గురం కలిసి ఈ కథను ముందుకు తీసుకెళ్ళాం. టీజర్‌ మీ అందరికీ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ‘దృశ్యం’ సినిమా తరహాలో ఉండే మంచి థ్రిల్లర్‌ ఇది’ అని డైరెక్టర్‌ అభినయ కృష్ణ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -