గ్రామలవారీగా సరఫరా చేయాలి : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
యూరియా సరఫరా యాప్ ద్వారా కాకుండా గ్రామల వారిగా సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుకు ఒక యూరియా బస్తా కాకుండా రబీ సీజన్ సాగు విస్తీర్ణం ఆధారంగా అందించాలనీ, యూరియా బ్లాక్ మార్కెట్, అదనపు ఎరువులు అంటగట్టే పద్దతిని నిరోధించాలని కోరారు. తెలంగాణలో యాసంగి సీజన్‌కు 10.40 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 4 లక్షల టన్నులు ఇప్పటికే సరఫరా చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో రైతులు క్యూలైన్లలో ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులకు సబ్సిడీలో కోత విధించి, సరఫరాను తగ్గించే ప్రయత్నం చేస్తున్నదనీ, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రైతులను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూరియా కోసం వేలాది మంది రైతులు మన గ్రోమోర్ సెంటర్లు, సొసైటీ కార్యాలయాలు వద్ద మహిళలు క్యూ లైన్లలో నిలబడి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యూరియా సరఫరాను గ్రామల వారిగా రైతులకు సాగు విస్తీర్ణం ఆధారంగా కూపన్లు జారీ చేసి సరఫరా చేయాలని కోరారు. రైతులకు అవసరం లేని ఎరువులు, యూరియాతో పాటు అదరనంగా ఇతర మందుల్ని బలవంతంగా అంటగట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తుండడంతో రైతులు అధిక ధరలకు కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి అవసరం లేని మందులు రైతులకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, అరిబండి ప్రసాద్ రావు, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ తదితరులు పాల్గొన్నారు.
యూరియా సరఫరాకు యాప్ వద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



