Thursday, January 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిట్ విచారణ పక్కదారి పట్టించే ప్రయత్నం

సిట్ విచారణ పక్కదారి పట్టించే ప్రయత్నం

- Advertisement -

హరీష్ రావుకు ఎంపీ చామల కౌంటర్ 
నవతెలంగాణ – ఆలేరు 

సిట్ విచారణ కోసం నోటీలు ఇస్తే హరీష్ రావు తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నవతెలంగాణ తో గురువారం మాట్లాడుతూ.. ప్రెస్ మీట్ లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే నోటీసులు ఇస్తున్నారని చెప్పే నీ కాకమ్మ కథలు ప్రజలు నమ్మరన్నారు.నైని బొగ్గు బ్లాక్ టెండర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టంగా అప్పటి బి ఆర్ ఎస్  ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు ఎందుకు రద్దు అయ్యాయో స్పష్టం చేసినప్పటికీ సిట్ విచారణ పక్కదారి పట్టించేందుకు నైని బ్లాక్ అంశాన్ని తెరపైకి తేవాలని చూస్తున్నారని ఆరోపించారు.

కెసిఆర్ సొంత అల్లుడు ఫోన్ టాప్ చేసిన విషయం బయటపడుతుందన్న భయంతో బావ బామ్మర్దులు రోజు ఏదో ఒక వంకతో కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామ్మర్ది కి బొగ్గు కాంటాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని అసత్యపు ఆరోపణలు మానుకోవాలన్నారు.ఫోన్ టాపింగ్ విషయంలో సిట్ విచారణకు కేటీఆర్ హరీష్ రావు సహకరించాలన్నారు. పదేళ్ల పాలన నియంతృత్వంతో కొనసాగిందని మిగులు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు.పదేళ్లు మీరు దోచుకున్నది గమనించే ప్రజలు మిమ్మల్ని అధికారానికి దూరం చేశారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -