హామీల అమలులో ప్రభుత్వాల వైఫల్యం : అఖిలభారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు కేరళంలో అమలు : పోతినేని సుదర్శన్, తీగల సాగర్
తెలంగాణ రైతు సంఘం యాదాద్రిభువనగిరి జిల్లా మహాసభ
13న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు పిలుపు
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
కేంద్ర ప్రభుత్వం విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు వ్యవసాయరంగాన్ని కట్టబెట్టాలని యత్నిస్తోందని అఖిలభారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం తెలంగాణ రైతు సంఘం జిల్లా మూడో మహా సభలో జూలకంటి ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన రాతపూ ర్వక హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. రైతుల సుదీర్ఘ పోరాటంలో మూడు నల్ల చట్టాలపై వెనక్కి తగ్గినా.. కొత్త విధానాల రూపంలో అమలు చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నూతన వ్యవసాయ మార్కెట్ విధానాలు, విత్తన, విద్యుత్ బిల్లుల ద్వారా రైతులను మరింత కష్టాల్లోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ విధానాలు రైతులను మార్కెట్ కరుణపై ఆధారపడేలా చేస్తూ.. కార్పొరేట్ కంపెనీల ఆధిపత్యాన్ని పెంచుతా యని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం రైతాంగానికి తీవ్ర ముప్పు అని, ఈ ఒప్పందం ప్రకారం అమెరికా వ్యవసా య ఉత్పత్తుల దిగుమతులకు భారతదేశంలో సుంకాలను పూర్తిగా తొలగించారని వివరించారు.
ఈ ఒప్పందం దేశ ఆహార భద్రతకు ప్రమాద కరమ న్నారు. ప్రభుత్వం సాగుకు అందించే సబ్సిడీలు, బోనస్‌లు తగ్గించే ఒత్తిడి పెరుగు తుందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పంట బోనస్‌లపై ఆంక్షలు విధించే ప్రయత్నా లు జరుగుతు న్నాయని, ఇది రైతులకే కాకుండా దేశ ప్రజలం దరికీ నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు.
కేరళంలో పంటకు రూ.800 బోనస్ పోతినేని సుదర్శన్, తీగల సాగర్
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు ఒక్క కేరళం రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్నాయని, విద్యా, వైద్యం రైతులు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర రూ.2380, బోనస్ రూ.800 ఇస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదన్నారు. బోనస్ ఇవ్వడం లేదని, రైతు భరోసా లేదని చెప్పారు. విద్యా, వైద్య రంగాల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతాంగానికి 40 రకాల హామీలు ఇచ్చి.. ఈ రెండు సంవత్స రాల్లో కొన్ని మాత్రమే అమలు చేసిందని చెప్పారు. అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బడ్జెట్ ప్రతిపాదనలే లేవన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవ సాయ రంగానికి రూ.23,179 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. గతేడాది రూ. 24,439 కోట్లు కేటాయిస్తే.. గతంతో పోల్చితే ఈసారి రూ.1260 కోట్లు తగ్గించారన్నారు.
రైతు బీమా, రైతు రుణమాఫీ 30 శాతం అర్హులైన రైతులకు జరగలేదన్నారు. పత్తి, వరి పంటలు మాత్రమే మద్దతు ధరల ఆధారంగా సాగు చేస్తున్నారన్నారు. ఆ రైతులకు కూడా కనీస మద్దతు ధరలు అమలు కావడం లేదని చెప్పారు. భూభారతి వల్ల కౌలుదారులకు ఆర్థిక రక్షణ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుం టున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాం గానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 13న ఇందిరా పార్కు వద్ద జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.జహంగీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు గూడూరు అంజిరెడ్డి ప్రసంగించారు. మేక అశోక్‌రెడ్డి, కోట రామచంద్రారెడ్డి, చీరిక అలివేలు అధ్యక్షత వహించిన ఈ మహాసభలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు బూరుగు కృష్ణారెడ్డి, దొడ్డ యాదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయరంగాన్ని ‘కార్పొరేట్ల’ కు కట్టబెట్టే యత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



