Wednesday, April 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం

ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం

- Advertisement -

వైట్‌ చాలెంజ్‌కు సిద్ధమా..?
అసెంబ్లీలో డ్రగ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ పెట్టాలి : అద్దంకి దయాకర్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపకుండా.. లేని అంశాలు మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఒక ఎజెండాతో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ అన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. డ్రగ్స్‌ పార్టీలో బీఆర్‌ఎస్‌ నేతలు దొరికితే వారిని ఇప్పటివరకు సస్పెండ్‌ చేయలేదన్నారు. వైట్‌ చాలెంజ్‌కు సిద్ధమా? అని బీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు. గతంలో టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌కు.. ఇప్పుడు డీఆర్‌ఎస్‌గా (డ్రగ్స్‌ రాష్ట్ర సమితి) మారిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్‌ రాలేదని, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో చర్చకు రారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఇప్పుడు నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోందన్నారు. అసెంబ్లీలో డ్రగ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని తాను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తానన్నారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి ఎప్పుడూ నష్టం జరగదని, పదవి ఇవ్వడంలో కొంత ఆలస్యం కావచ్చుకానీ, ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఉండదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -