Thursday, January 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅలరించే మెలోడి 'నీ మాయలో పడేట్టుగా..'

అలరించే మెలోడి ‘నీ మాయలో పడేట్టుగా..’

- Advertisement -

నరేష్‌ అగస్త్య హీరోగా నటిస్తున్న థ్రిల్లర్‌ ‘అసురగణ రుద్ర’. సంగీర్తన విపిన్‌, ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మురళీ కాట్రాగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కమ్జుల ప్రొడక్షన్స్‌ పతాకంపై మురళి కమ్జుల, వంశీ కాంజుల నిర్మిస్తున్నారు. తాజాగా మేకర్స్‌ ‘నీ మాయలో పడేట్టుగా’ అనే సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. శేఖర్‌ చంద్ర ఈ పాటను ఎంతో సున్నితంగా హృదయాన్ని తాకే బ్యూటీఫుల్‌ మెలోడీగా కంపోజ్‌ చేయగా, చైతు సత్సంగి అందించిన లిరిక్స్‌ పాటకు మరింత ప్రాణం పోశాయి. రమ్య బెహరా, సిద్ధార్థ్‌ మీనన్‌ వోకల్స్‌ మెలోడీని మరో స్థాయికి తీసుకెళ్లాయి.

కొత్తగా పెళ్లయిన జంట ప్రేమను సెలబ్రేట్‌ చేసే ఈ సాంగ్‌లో లీడ్‌ పెయిర్‌ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తం మీద ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. రవివర్మ, శుభలేఖ సుధాకర్‌, ప్రియాంక శర్మ, ఆర్యన్‌ రాజేష్‌, అమిత్‌ శర్మ, దేవి ప్రసాద్‌, ఆమని, నిఖిల్‌ దేవదూల, బేబీ శ్రీదేవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలు: సుధాకర రెడ్డి విప్పల, అప్పి రెడ్డి, డీఓపీ : అమర్‌నాథ్‌ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్‌: శ్రీకాంత్‌ పట్నాయక్‌ ఆర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : శ్రీహరి గౌడ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రఘు కులకర్ణి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -