Wednesday, February 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకాలిఫోర్నియాతో ఇంధన ఒప్పందమా ?

కాలిఫోర్నియాతో ఇంధన ఒప్పందమా ?

- Advertisement -

బ్రిటన్‌పై ట్రంప్‌ కస్సుబుస్సు
వాషింగ్టన్‌ : కాలిఫోర్నియా గవర్నర్‌ గేవిన్‌ న్యూసమ్‌, బ్రిటన్‌ మధ్య కుదిరిన ఇంధన ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన గవర్నరుతో బ్రిటన్‌ ఒప్పందం కుదుర్చుకోవడమేమిటని ఆయన ప్రశ్నిస్తూ ఇది సరైంది కాదని చెప్పారు. న్యూసమ్‌ను ఓ పరాజితుడిగా ఆయన అభి వర్ణించారు. ‘ఆయన రాష్ట్రం నరకకూపంలోకి పోయింది. పర్యావరణంపై ఆయన చేసిన పని నాశనమై పోయింది’ అని శాపనార్థాలు పెట్టారు. ట్రంప్‌ను విమర్శిస్తున్న వారిలో న్యూసమ్‌ ఒకరు. 2028లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసేందుకు ఆయన డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థిత్వాన్ని కోరుతున్నారు. న్యూసమ్‌, బ్రిటన్‌ ఇంధన మంత్రి ఎద్‌ మిలిబాండ్‌ మధ్య ఇంధన సహకారానికి సంబంధించి సోమవారం ఒప్పందం కుదిరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -