సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధిశెట్టి, రాశి ఖన్నా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’. స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కతి ప్రసాద్ నిర్మిం చారు. ఈ సినిమా ఈనెల 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ,’మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్‌లో ఏం చూసారో సినిమాలో కూడా అదే క్యారెక్టర్, టోన్ కనిపిస్తుంది. టిల్లు లాంటి క్యారెక్టర్ నుంచి బయటికి రావాలంటే ఇలాంటి సినిమాలు చేయాలి. టిల్లు ఇన్నోసెంట్, కానీ ‘తెలుసు కదా’ అలా కాదు. ఇంటెలిజెంట్ క్యారెక్టర్. వరుణ్ క్యారెక్టర్ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది. ఇది యూత్‌కి, ఫ్యామిలీస్‌కి నచ్చే సినిమా’ అని తెలిపారు.
‘ఇది ఒక రాడికల్ సినిమా అవుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత టిల్లుని మరిచిపోతారు. అంత నమ్మకం ఉంది’ అని హీరోయిన్ రాశి ఖన్నా చెప్పారు. మరో హీరోయిన్ శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ, ‘ట్రైలర్ చూసిన తర్వాత చాలా రాడికల్‌గా అనిపించింది. సినిమా కోసం నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు.
డైరెక్టర్ నీరజ కోన మాట్లాడుతూ,’ఇది నా ఫస్ట్ ఫిలిం. నాకు చాలా స్పెషల్ సినిమా. ట్రైలర్‌లో మీరు చూసిన దానికి పది రెట్లు సినిమాలో ఉంది. గెట్ రెడీ ఫర్ ఫన్ రైడ్’ అని తెలిపారు. ‘ట్రైలర్‌లో కొంచెమే చూపించాము. సినిమాలో చాలా ఉంది. ఈనెల 17 అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను’ అని వైవా హర్ష చెప్పారు.
ప్రొడ్యూసర్ కతి ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ కథ వినగానే నచ్చింది. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్న టీం విషయంలో ప్రౌడ్‌గా ఉంది’ అని అన్నారు.
‘మాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్, కతి ప్రసాద్‌కి ధన్యవాదాలు. ట్రైలర్ అదిరిపోయింది. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు అద్భుతంగా పెరిగాయి’ అని మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి చెప్పారు.
అందరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్టైనర్
- Advertisement -
- Advertisement -