నటి మధు శాలిని సమర్పకురాలిగా రూరల్ లవ్‌స్ట్టోరీతో ‘కన్యా కుమారి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం ఈనెల 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రజెంటర్ మధు షాలిని మాట్లాడుతూ,’మా అమ్మ, న్నాన ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత మా అమ్మ ఉన్నత విద్యల్ని అభ్యసించారు. ఒకరిని ఒకరు చాలా సపోర్ట్ చేసుకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మానాన్నల లవ్ స్టోరీ కూడా ఇలానే స్టార్ట్ అయ్యింటుందనిపించింది. ఇది ఈ సినిమాతో నాకు ఉన్న పర్సనల్ కనెక్షన్. సజన్ చాలా కష్టపడి ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. ఈ సినిమాని బన్నీ వాసుకి చూపించబోతున్నాం. ఆయనకి నచ్చాలని కోరుకుంటున్నా. వినాయక చవితి రోజు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది’ అని తెలిపారు.
‘దర్శకుడిగా నాకు ఇది రెండో చిత్రం. ప్రొడ్యూసర్‌గా నా మొదటి చిత్రం. ఈ సినిమా పంట పొలాల్లో గట్ల మీద పుట్టిన ఒక వైల్డ్ ప్లవర్ లాంటిది. కరోనా లాక్ డౌన్ సమయంలో శ్రీకాకుళంలో ఒక ఊరిలో ఉండిపోయాను. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి మార్నింగ్ వాక్ చేస్తూ శ్రీకాకుళం వరకు నడిచి వెళ్ళేది. ఆ పక్కనే నలుగురు కుర్రాళ్ళు ఒక చెట్టు కింద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈ విజువల్ నాకు చాలా నచ్చింది. అలాంటి మనుషులతో అక్కడే సినిమా చేయాలనిపించింది. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఇక్కడ కొంత మందికి చూపించాం. వాళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. అప్పుడు మరింత నమ్మకం వచ్చింది. షాలిని మేడం ఈ సినిమా చూశారు. చాలా సపోర్ట్ చేశారు. నేచురల్ క్యారెక్టర్స్‌తో ఉండే హై ఎంటర్ టైనర్ ఇది. రియల్ ఎమోషన్స్ ఉంటాయి’ అని డైరెక్టర్ సజన్ చెప్పారు.
కో ప్రొడ్యూసర్స్ అప్పలనాయుడు, సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, ‘పల్లెటూరి ప్రేమ కథ వచ్చి చాలా రోజులైంది. ఇది నేచురల్ లవ్ స్టోరీ. చాలా అద్భుతమైన లొకేషన్స్ ఈ సినిమాలో చూస్తాం. సజీవమైన కళింగాంధ్ర భాషను కూడా ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాకి మధు శాలిని చాలా సపోర్ట్ చేశారు. సజన్ గొప్ప విజన్‌తో తీశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ చాలా కొత్త అనుభూతిని అందిస్తుంది’ అని అన్నారు.
అలరించే పల్లెటూరి ప్రేమకథ
- Advertisement -
- Advertisement -