ముంబయి : 150 మందికి పైగా ఆర్కిటెక్ట్‌లు, ఇటీరియర్ డిజైనర్స్ ఉత్సాహంగా పోటీపడిన ‘ఏసియన్ పెయింట్స్ ఆర్కిటెక్ట్ పికిల్‌బాల్ టోర్నమెంట్’ ఆదివారం ముంబయిలో ముగిసింది. పలు వేదికల్లో జరిగిన ప్రాక్టీస్ సెషన్లలో నిపుణత సాధించిన ఆర్కిటెక్ట్‌లు.. టోర్నీలో ప్రొఫెషనల్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నమెంట్‌తో ఆర్కిటెక్ట్‌లలో ఆరోగ్యంపై అవగాహన, స్నేహశీలత, జట్టుతత్వం బలపడ్డాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడి) కార్యదర్శి మిలింద్ పాయ్ అన్నారు. ఏసియన్ పెయింట్స్ ఎండీ మనీశ్ షా, హెరిటేజ్ మార్బుల్ ఎండీ రహూల్ జిందాల్, కంప్లక్స్ ఎండీ నితిన్ అగర్వాల్, ది సెలెక్ట్ సీఈవో మయూర్ జైన్‌లు విజేతలకు బహుమతులు అందజేశారు.



