మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యులైన పవన్‌కళ్యాణ్ తాజాగా ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ ద్వారా ఆయనకు ”టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే విశిష్ట బిరుదుతో సత్కారం కూడా చేయటం విశేషం.
పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లోనూ తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజా నాయకుడిగా మన్ననలు పొందుతున్నారు. సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించకముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది.
అత్యంత అరుదైన ఘనత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


