నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
బిసీ 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బంద్ తో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ స్తంభించి పోవడంతో నల్లగొండ నుండి మిర్యాలగూడకు ప్రయాణించిన నెమ్మాని సంధ్య ప్రయాణ సమయంలో ఆటోలో ల్యాప్టాప్‌తో పాటు ₹1500 నగదు మరిచిపోయారు. అయితే, ఆ ఆటో డ్రైవర్ ఎండి లతీఫ్ నిజాయితీతో, మానవత్వంతో ల్యాప్టాప్, నగదును సురక్షితంగా నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి అప్పగించారు. టూ టౌన్ ఎస్ఐ వై. సైదులు వెంటనే తన సిబ్బందితో విచారణ జరిపి యజమాని అయిన నెమ్మాని సంధ్యని సంప్రదించి, ఆమెకు ల్యాప్టాప్, నగదు మొత్తాన్ని స్వయంగా అప్పగించారు. ఈ సందర్భం గా ఎస్ఐ వై. సైదులు ఆటో డ్రైవర్ ఎండి లతీఫ్ ని అభినందించి, ఆయన నిజాయితీ, మానవత్వాన్ని ప్రశంసించారు. ఇలాంటి మంచితనం సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ ఎంఏ ఫరూక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES