- Advertisement -
నవతెలంగాణ – తాడ్వాయి : మండలంలోని మేడారం వనదేవతల సన్నిధిలో మేడారం కాలనీకి చెందిన ఆలం సమ్మారావు, నవీనల ఆదర్శ వివాహం శుక్రవారం ఘనంగా జరిగింది. ఇద్దరు ఒకే ఆదివాసి కుటుంబాలకు చెందినవారే అయినా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని, పెద్దల ఆశీస్సుల మేరకు మేడారం గద్దెల ప్రాంగణంలో వివాహం జరుపుకున్నారు. ఆదివాసి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం.. భక్తి, పవిత్రతో కూడుకొని వారు తమ దైవాలను, ప్రకృతిని, పెద్దలను గౌరవిస్తూ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూజారులు, అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షులు భోజరావు, యూత్ నాయకులు ఆడియో సంఘాల నాయకులు, మహిళలు, ఇరు గ్రామాల ప్రజలు బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -