Wednesday, January 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ చరిత్రపై లోతైన అధ్యయనం

తెలంగాణ చరిత్రపై లోతైన అధ్యయనం

- Advertisement -

కట్టా శేఖర్‌ రెడ్డి రచన ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ : సీనియర్‌ పాత్రకేయులు కె. రామచంద్రమూర్తి
నవతెలంగాణ-కల్చరల్‌

కట్ట శేఖర్‌ రెడ్డి రచించిన ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ లోతైన అధ్యయనంతో రాశారని సీనియర్‌ పాత్రకేయులు కె. రామచంద్రమూర్తి అన్నారు. సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ కట్టా శేఖర్‌ రెడ్డి రచించిన ‘తెలంగాణ చరిత్ర మూలాలు’ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్‌ రవీంద్ర భారతిలోని పైడి జయరాజ్‌ మినీ థియేటర్‌లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కె,రామచంద్రమూర్తి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కట్టా శేఖర్‌ రెడ్డి తెలంగా ణ చారిత్రక భౌగోళిక, సాంఘీక పరిస్థితులపై పరిశోధన చేసి రాసిన వ్యాసాలు ఉపయుక్తంగా ఉన్నాయని అన్నారు. ఇంకా పరిశోధనలు జరిగితే కొత్త ఆధారాలు దొరుకుతాయని తెలిపారు. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌, ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ఆదికవి నన్నయ్యకు ముందు తెలుగు లేదని, గత కాలంలో ప్రయత్నం చేశారని అన్నారు. నన్నయ్య కన్నా ముందే నల్లగొండకు చెందిన పాల్కురికి సోమనాథుడు తెలుగు కావ్యాలు రాశారని చెప్పారు. ‘నా తెలుగు భాషనే తెలంగాణ భాష’ అని వివరించారు. ఆధిపత్య పోరులో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. కట్టా శేఖర్‌ రెడ్డి రచించిన పుస్తకం తెలంగాణకు మూలం అని తెలిపారు. చరిత్రను తిరిగి రాసినప్పుడే చారిత్రక రుణాన్ని తీర్చుకో గలమన్నారు. తెలంగాణ మూలలపై యూనివ ర్సిటీలు, రాష్ట్రంలో తెలుగు శాఖలు ముందుకు వచ్చి పరిశోధన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రెస్‌ అకాడమీ పూర్వ చైర్మెన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ.. పాత్రికేయ రంగంలో తెలంగాణ అభిమానంతో పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపించిన ఘనత తమకే దక్కిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ చరిత్ర, భాషపై అధ్యయనం జరగలే దన్నారు. ప్రముఖ రచయిత, సీనియర్‌ జర్నలిస్ట్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తెలంగాణ మూలాలను తెలుసు కోవడానికి తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకం ఆసక్తి, అభిరుచిని పెంచడానికి ఉపయో గపడుతుందన్నారు. పుస్తకం కేవలం పరిమా ణాత్మకం కాదని, గుణాత్మకమైన విషయమ న్నారు. భాషా సాహిత్యాభిమానులకు, చరిత్రాభి మానులకు అమూల్య పుస్తకమని ప్రశంసిం చారు. ఈ కార్యక్ర మంలో సాహిత్య అకాడమీ మాజీ చైర్మెన్‌ జూలూరి గౌరీ శంకర్‌, జర్నలిస్ట్‌ వ్యద్దెల్లి మురళి, దిశ సంపా దకులు మార్కండేయ, కోవెల సంతోష్‌ కుమార్‌, మాజీమంత్రి జగదీష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -