- Advertisement -
నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నాయనవానికుంట తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి రమావత్ వినోద్ కుమార్ విజయం సాధించారు. ప్రత్యర్థి, కాంగ్రెస్ బలపరిచిన రమావత్ పాండు నాయక్ పై 17 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసందర్బంగా నూతన సర్పంచ్ మాట్లాడు తూ తన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన నాయనవానికుంట, నాయిన వాని కుంట తండా, గ్రామ ప్రజకు, గ్రామ యువతకు, మహిళలకు ధన్యవాదాలు తెలిపారు. తండా, గ్రామ అభివృద్ధికి పాటుపడుతానని తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండిగ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. పేద ప్రజలకు సేవచేస్తానన్నారు.
- Advertisement -



