– గెలలు దిగుమతి లో తీవ్ర జాప్యం
– ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రైతులు వినతి
– అప్పారావు పేట కు తరలించాలని ఆదేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక పామాయిల్ పరిశ్రమ గురువారం మధ్యరాత్రి స్వల్ప సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో గెలులు దిగుమతిలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. మద్యాహ్నం ఒంటిగంట వరకు పరిశ్రమకు గెలలు తరలించిన వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఆందోళనకు దిగారు. విషయ తెలుసుకున్న రైతు నాయకులు తుంబూరు మహేశ్వరరెడ్డి పరిశ్రమ మేనేజర్ తో మాట్లాడారు.
గెలలు దిగుమతి లో 3 గంటలు కంటే జాప్యం లేకుండా గెలలు తీసుకోవాలని,ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి కి రాసిన వినతి పత్రాన్ని పరిశ్రమ మేనేజర్ నాగబాబుకు అందజేసారు. పరిశ్రమ తిరిగి ప్రారంభం అయినప్పటికీ 13 వందల టన్నులు నిల్వ ఉండటంతో అశ్వారావుపేట కు బదులుగా అప్పారావు పేట కు గెలలు తరలించాలని జనరల్ మేనేజర్ ఆదేశాలు ఇచ్చారు.దీంతో రైతులు ఆందోళన విరమించారు.