Monday, July 7, 2025
E-PAPER
Homeసినిమాథ్రిల్‌ చేసే వినూత్న కాన్సెప్ట్‌

థ్రిల్‌ చేసే వినూత్న కాన్సెప్ట్‌

- Advertisement -

హాస్యనటుడు ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలోని బకాసుర టైటిల్‌ ర్యాప్‌ సాంగ్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు.
వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ర్యాప్‌ సింగర్‌ రోల్‌ రైడ్‌, వికాస బడిస ఆలపించారు. ఈ సందర్భంగా అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, ‘ బకాసుర రెస్టారెంట్‌ టైటిల్‌తో పాటు ఈ పాట కూడా బాగుంది. చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా ఐడియా బాగుంది. నటుడు ప్రవీణ్‌ నాకు మొదట్నుంచి తెలుసు. ప్రవీణ్‌ హీరోగా రాబోతున్న ఈ చిత్రం మంచి సక్సెస్‌ కావాలి. తొలి చిత్ర దర్శకుడు ఎస్‌జే శివతో పాటు అందరికి ఈ చిత్రం మంచి పేరు తీసుకురావాలి’ అని అన్నారు.
‘హంగర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని దర్శకుడు ఎస్‌జే శివ తెలిపారు. ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినరు కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్‌: శ్రీ రాజా సీఆర్‌ తంగాల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -