Monday, January 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

సింగరేణి అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

- Advertisement -

– మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సింగరేణి కుంబకోణంపై సిట్టింగ్‌ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భట్టి విక్రమార్క మాటలు ఉల్టా చోర్‌ కొత్వాల్‌కో డాంటే అన్నట్టుందని ఎద్దేవా చేశారు. స్కాం సూత్రధారి రేవంత్‌ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బామ్మర్ది సజన్‌రెడ్డి అని గుర్తు చేశారు. పాత్రదారితో మాట్లాడి విచారణ చేయిస్తానని అనడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సైనిక్‌ స్కూల్లో బట్టలు ఆరబెట్టే మిషన్‌ కోసం పెట్టిన నిబంధనను రూ. వేల కోట్ల సింగరేణి ఓబీ కాంట్రాక్టులకు ముడిపెట్టడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. జనవరిలో సైట్‌ విజిట్‌ లేకుండా 7శాతం తక్కువకు టెండర్లు ఖరారైతే.. మే నెలలో ఆ నిబంధన పక్కన పెట్టి అంచనా రేట్ల కంటే ఎక్కువకు ఎందుకు కట్టబెట్టారని నిలదీశారు. ”సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్రానిది. 49శాతం వాటా కేంద్రానిది. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నాయి. సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ నిబంధనతో ఖరారైన ఓబీ వర్క్స్‌, సోలార్‌ పవర్‌ ప్లాంట్స్‌ టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలి. నైనీ కోల్‌ బ్లాక్‌ టెండర్‌తో పాటు, అవినీతి జరిగిన అన్ని టెండర్లపై విచారణ జరిపించాలి. వెంటనే ప్రతి నెలా మెడికల్‌ బోర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి” అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కార్మికులకు ఇండ్లిస్తే.. కాంగ్రెస్‌ ఒక్కరికైనా ప్లాటిచ్చిందా అని ప్రశ్నించారు. సింగరేణి గడించిన లాభం రూ.6,394 కోట్లకు గాను కేవలం రూ.2,360 కోట్లు మాత్రమే ప్రాఫిట్‌ గా చూపించారని విమర్శించారు. కార్మికుల బోనస్‌లో కోత పెట్టి, ఆ డబ్బును ఫుట్‌బాల్‌ సోకులు, ముఖ్యమంత్రి ప్రచారాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. రెండేండ్లలో సింగరేణి అభివద్ధి కోసం పక్కన పెట్టిన రూ.6 వేల కోట్లు ఏమయ్యాయయని నిలదీశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -