No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజాతీయంపార్లమెంట్‌ గోడ దూకి.. లోపలికి వెళ్లిన చొరబాటుదారుడు

పార్లమెంట్‌ గోడ దూకి.. లోపలికి వెళ్లిన చొరబాటుదారుడు

- Advertisement -

– భద్రతపై సందేహాలు
ఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్‌ భవనం వద్ద భద్రతాపరమైన ఉల్లంఘన చోటుచేసుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ ప్రాంతంలో ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి, గోడ దూకి పార్లమెంట్‌ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు భవన్‌ వైపు నుంచి గోడ దూకి కొత్త పార్లమెంట్‌ భవనానికి చెందిన గరుడ గేట్‌ వద్దకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు. ఆ చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటిరోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. జులై 21న ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి 2023లో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల వేళ లోక్‌సభ లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ పై ఉగ్రదాడి జరిగి 22 ఏండ్లు అయిన డిసెంబరు 13న ఆ ఘటన చోటుచేసుకోవడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. లోక్‌సభలోని పబ్లిక్‌ గ్యాలరీ వద్ద కూర్చొన్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వదిలి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. అదే సమ యంలో పార్లమెంట్‌ వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు ఇదేరకమైన నిరసనను చేపట్టారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గతేడాది ఆగస్టులో కూడా ఈతరహా ఉల్లంఘన చోటుచేసుకోవటం గమ నార్హం. నిందితుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనీశ్‌గా పోలీసులు గుర్తించారు. అప్పుడు ఆ నిందితుడి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని అప్పట్లో పోలీసులు వెల్లడించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యక్తిగా గుర్తింపు..
తాజా ఘటనలో పేర్కొన్న నిందితుడిది ఉత్తర్‌ప్రదేశ్‌. అతడి పేరు రామా అని అధికారులు వెల్లడించారు. 20 ఏండ్ల ఆ వ్యక్తి మానసిక పరిస్థితి సరిగాలేదని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే అతడు ఏ ఉద్దేశంతో ఇలాంటి చర్యకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు ఐబీ, ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక విభాగం అతడిని ప్రశ్నిస్తోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ ప్రాంతంలో ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి, గోడ దూకి పార్లమెంట్‌ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు భవన్‌ వైపు నుంచి గోడ దూకి కొత్త పార్లమెంట్‌ భవనానికి చెందిన గరుడ గేట్‌ వద్దకు చేరుకున్నాడని అధికారులు తెలిపారు. ఆ చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad