Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రీజనల్ కోఆర్డినేటర్ అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి..

రీజనల్ కోఆర్డినేటర్ అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి..

- Advertisement -

బీసీ విద్యార్థి సంఘం నేత లింగయ్య యాదవ్.. 
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
: ఉమ్మడి నల్గొండ జిల్లా మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల రీజనల్ కోఆర్డినేటర్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో బీసీ సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీజనల్ కోఆర్డినేటర్ గెస్ట్ లెక్చరర్స్ ని ఆమెకు ఇష్టం వచ్చినట్లు తీసేయడంతో పాటు వాళ్ల కు సంబంధించిన వాళ్లను రిక్రూమెంట్ చేసుకోవడం జరుగుతుంది.

అదేవిధంగా దేవరకొండ మహాత్మ జ్యోతిరావు పూలే బాలుర పాఠశాలలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి గేస్ట్ కోచ్, ఇంగ్లీష్. మ్యాథ్స్ లెక్చరర్ ప్రిన్సిపాల్ లపై విచారణ జరపాలి అని అన్నారు.సూర్యపేట లో ఉన్న మద్దిరాల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ ఇంటి వద్ద స్కూల్ సానిటరీ సిబ్బందితో పనిచేయించుకోవడం.డిగ్రీ కాలేజీలో లేని ఎకనామిక్స్ సబ్జెక్ట్ ని ప్రవేశపెట్టి తనకు కావలసిన గెస్ట్ లెక్చరర్ నియమించుకొని అతనితో తనకు కావలసిన పనులన్నీ చేయించుకోవడం జరుగుతుంది అని అన్నారు.

అతని పేరుపై స్కూలు చెక్కులు రాయించడం ఆ డబ్బులు డ్రా చేసుకొని రావడం వంటి చర్యలు చేపడుతున్న ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.రెగ్యులర్ లెక్చరర్ ఉన్న సోషలజి సబ్జెక్ట్ ని తీసేయడం వల్ల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని అన్నారు.ఇలాంటి పనులన్నీ చేసిన ప్రిన్సిపాల్ ని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.వీటన్నిటికీ సహకరిస్తున్న రీజినల్ కోఆర్డినేటర్ పై విచారణ జరిపి చట్టపరమైన చర్య తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు తగుళ్ళ జనార్ధన్, రాజేష్,మహేష్,నరేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -