న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో రూ.10,000 కోట్ల పెట్టుబడిని ప్రతిపాదించారు. దేశ ఔషధ పరిశ్రమకు ప్రోత్సా హాన్ని ఇస్తుంది. బయోఫార్మాస్యూటికల్స్‌లో బయోలాజిక్స్, రసాయన విశ్లేషణ ద్వారా కాకుండా జీవులు, కణాలు లేదా కణ జాలాలనుండి తయారయ్యే సంక్షిష్టమైన మందులను రూపొందిస్తారు.
తయారీ, వ్యూహాత్మక మరియు సరిహద్దు రంగాలు, ఆరోగ్య సంరక్షణ మరియు అదునాథన సాంకేతికత సహా ఆరురంగాల్లో చొరవను కూడా ప్రతిపాదించారు.
సెమీ కండక్టర్ మిషన్ 2.0పూర్తి స్థాయి భారతీయ ఐపీ (మేథో సంపత్తి) కోసం రూపొందించిన పరికరాలు మరియు సామగ్రిని ఉత్తత్తి చేయడంపై దృష్టిసారిస్తుందని అన్నారు.
ఖనిజ సంపన్న రాష్ట్రాలైన ఒడిశా, కేరళ ఆంధ్రప్రదేశ్, తమిళనాడులకు కీలకమైన ఖనిజసౌకర్యానలు స్థాపించడానికి మద్దతును ప్రకటించారు.
బడ్జెట్ ఎఫెక్ట్ – సండే స్టాక్ మార్కెట్ – భారీ పతనం
కేంద్ర వార్షిక బడ్జెట్ వేళ …. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. నిఫ్టీ 300 పాయింట్లకు పైగా, సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడింది. సాధారణంగా ఆదివారం రోజు స్టాక్ మార్కెట్లకు సెలవు. అయితే యూనియన్ బడ్జెట్ 2026 కారణంగా.. ఈ రోజు (ఫిబ్రవరి 1) కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి. నేడు దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు 290.58 పాయింట్ల నష్టంతో 82,275.79 వద్ద, నిఫ్టీ 117.45 పాయింట్ల నష్టంతో 25,301.45 వద్ద కొనసాగుతున్నాయి. యునైటెడ్ ఫుడ్‌బ్రాండ్స్ లిమిటెడ్, సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్ లిమిటెడ్, రాజ్‌దర్శన్ ఇండిస్టీస్ లిమిటెడ్, ఐకెఐఒ టెక్నాలజీస్ లిమిటెడ్, ఫుజియామా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్, ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా లిమిటెడ్ కంపెనీలు నష్టాల జాబితాలోకి చేరాయి.
7 నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు : మంత్రి నిర్మలా సీతారామన్
ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదివారం వార్షిక బడ్జెట్‌లో … కేంద్ర ఆర్థిక మంత్రి ఈ కీలక ప్రకటన చేశారు. ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు ప్రకటించారు. ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, ఢిల్లీ-వారణాశి, వారణాశి -సిలిగుడి, చెన్నై-బెంగళూరు మధ్య ఏడు కారిడార్లు ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయించారు.
‘పస’ లేని బడ్టెట్ : జైరామ్ రమేష్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పసలేదని కాంగ్రెస్ విమర్శిచింది. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ‘పూర్తిగా నీరసంగా’ ఉందని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరాం రమేష్ పేర్కొన్నారు. బడ్జెట్‌పై పూర్తి అంచనాలను అందుకోలేక పోయిందని అన్నారు. నిర్మలా సీతారామన్ ప్రసంగంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆమె ప్రసంగంలో పారదర్శకత లోపించిందని, కీలక కార్యక్రమాలు, పథకాలకు బడ్జెట్ కేటాయింపుల గురించి ఎటువంటి ప్రకటనలు లేవని అన్నారు. ”డాక్యుమెంట్లను వివరంగా అధ్యయనం చేయవలసి ఉన్నప్పటికీ.. 90 నిమిషాల బడ్జెట్ ప్రసంగం అంచనాలను అందుకోలేకపోయింది. ఇది పూర్తిగా నిరుత్సాహంగా ఉంది” అని జైరామ్ రమేష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. కంటే తక్కువగా ఉందని స్పష్టమైంది.
బడ్జెట్ తర్వాత… 30 మంది కాలేజీ స్టూడెంట్లతో మంత్రి నిర్మలా భేటీ
కేంద్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌ను లోక్‌సభకు సమర్పించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ విధి విధానాలు, రూపకల్పన విషయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొంతమంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కళాశాలల నుంచి 30 మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థులు లోక్‌సభ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా బడ్జెట్ ప్రసంగాన్ని వినే అవకాశం కల్పించారు. వీరు కర్తవ్య భవన్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా సందర్శించనున్నారు. ఆర్థిక శాఖ పనితీరు, విధాన రూపకల్పన ప్రక్రియలు, అత్యున్నత స్థాయిల్లో ఆర్థిక నిర్ణయాలు ఎలా రూపొందిస్తారు, అమలు చేస్తారు అనే విషయాలను ఆ విద్యార్థులు తెలుసుకోనున్నారు. పరిపాలనకు సంబంధమైన విషయాలపై విద్యార్థుల్లో అవగాహన తీసుకురావడానికి కేంద్రం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విద్యార్థులతో సమావేశమై.. బడ్జెట్‌పై వారి అభిప్రాయాలను, సూచనలను తెలుసుకోనున్నారు.
సెమీకండక్టర్ మిషన్ 2.ఓ ను ప్రకటించిన మంత్రి నిర్మలా సీతారామన్
సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2 ఓ ను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదివారం లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ …. దేశ సెమీ కండక్టర్ రంగం వద్ధి కోసం సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2. ఓ ప్రకటించారు. ఇందుకోసం రూ.40 వేల కోట్లు కేటాయించ నున్నట్లు ప్రకటించారు. రూ.10 వేల కోట్లతో బయోఫార్మా శక్తి పథకాన్ని మంత్రి ప్రకటించారు. ఫార్మా, విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో కొత్త విద్యాసంస్థలు తీసుకురానున్నట్లు తెలిపారు.
స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామిక వేత్తలతో ‘షీమార్ట్స్’
స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జి) మహిళా పారిశ్రామికవేత్తలతో ‘షీమార్ట్స్’ను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ.. కమ్యూనిటీ యాజమాన్యంలో రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. లక్‌పతి దీదీ పథకంలో భాగంగా మహిళలు క్రెడిట్ లింక్డ్ జీవనోపాధి నుండి వ్యాపార సంస్థల యజమానులుగా మారడానికి ఇది మరో అడుగుగా పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇప్పటివరకు రెండు కోట్లమందికి పైగా మహిళలు లఖ్‌పతి దీదీలుగా మారారు. 2027 నాటికి మూడు కోట్ల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల వార్షిక ఆదాయం రూ.లక్ష చేరుకోవడమే లక్ష్యం అని పేర్కొంది.
బయోఫార్మారంగంలో రూ.10,000కోట్ల పెట్టుబడి
- Advertisement -
- Advertisement -



