Friday, March 27, 2026
E-PAPER
Homeఖమ్మంపింఛన్ నగదుతో సీతమ్మ వారికి నగ సమర్పించిన వృద్ధురాలు

పింఛన్ నగదుతో సీతమ్మ వారికి నగ సమర్పించిన వృద్ధురాలు

- Advertisement -

– ఆంధ్రా ఆధునిక శబరి గా బుచ్చమ్మ కు ప్రశంసలు
– తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ సహాయంతో పురోహితులు కు అందజేత
నవతెగాణ – అశ్వారావుపేట

శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆంధ్రా కు చెందిన ఓ వృద్ధురాలు బుచ్చమ్మ తనకు వచ్చే వృద్ధాప్య పింఛన్ నగదుతో సీతమ్మ వారికి నగ కొనుగోలు చేసి సమర్పించడం భక్తి భావానికి నిదర్శనంగా నిలిచింది.

ఆర్థికంగా లేమి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడిపై అపారమైన భక్తితో ఈ సమర్పణ చేయడం అక్కడి భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. ఆమె భక్తిని చూసిన స్థానికులు బుచ్చమ్మ ను “ఆంధ్రా ఆధునిక శబరి”గా అభివర్ణిస్తూ ప్రశంసలు కురిపించారు.

అయితే ఈ వృద్ధురాలు తాను తీసుకొచ్చిన ఆబరణాన్ని ఆలయం అధికారులకు చేరవేయడం ఎలాగో తెలియక ఆందోళన పడుతుండగా అక్కడ విధుల్లో ఉన్న అశ్వారావుపేట తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాళ్ శేష్ఠ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారి ఆదేశాలు మేరకు సీహెచ్వీ రామక్రిష్ణ భక్తురాలు ని ఆలయ అధికారుల వద్దకు తీసుకెల్లి ఆ నగ ను అందజేసారు.

ఈ అరుదైన ఘటన శ్రీరామ నవమి రోజున జరగడం విశేషంగా మారింది. భక్తి,నమ్మకం ఉంటే ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కావని బుచ్చమ్మ నిరూపించారని పలువురు అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -