Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంకాలం చెల్లిన కర్మాగారం..

కాలం చెల్లిన కర్మాగారం..

- Advertisement -

– మూడు సామర్ధ్యం పెంపు
– మొరాయిస్తున్న యంత్రాలు
– నూతన పరిశ్రమ నిర్మించాలి
– రైతుల డిమాండ్
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆయిల్ ఫెడ్ ఆద్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం అశ్వారావుపేట లో  2005 నిర్మాణం ప్రారంభించి 2007 లో ఆయిల్ గెలలు ను గానుగ ఆడటం మొదలు పెట్టిన ఏకైక పామాయిల్ పరిశ్రమ. ప్రారంభంలో ఐదు టన్నుల సామర్ధ్యం నుండి నేడు 30 టన్నుల సామర్ధ్యం తో నిర్వహించడానికి మూడు దఫాలు నమూనా మార్చి యంత్రాలను విస్తరించారు.కానీ కాలం చెల్లిన యంత్రాలతో తరుచూ మొరాయించడంతో ముడి ఆయిల్ తయారీకి తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.పరిశ్రమకు వచ్చిన గెలలు దిగుమతి లోనూ తీవ్రజాప్యం చోటు చేసుకుంటుంది.దీంతో రైతులు మరో పరిశ్రమను వెంటనే నిర్మించాలని డిమాండ్ ప్రారంభం అయింది.

ఉమ్మడి జిల్లాలో పామాయిల్ సాగు కొన్నేళ్లు గా గణనీయంగా విస్తరించింది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 2026 సంవత్సరం చివరి నాటికే ‘అశ్వారావుపేట లో రెండో పామాయిల్ పరిశ్రమ’ను అందుబాటులోకి తెస్తా మని 2022 లోనే నాటి పాలకులు,అధికారులు ప్రక టించారు.కొద్దిపాటి అడుగులు కూడా వేశారు.తర్వాత ఏమైందో తెలియదుగాని సత్తుపల్లి మండలం నిర్మాణం ప్రారంభించగా,సిద్ది పేట ల్లో నిర్మాణం పూర్తి చేసి నడపడానికి సిద్దం చేసారు.

ప్రస్తుత ఆశ్వారావుపేట పామాయిల్ పరిశ్రమ 2005 నిర్మాణం ప్రారంభించి 2007 లో నిర్వహణ లోకి తెచ్చారు. దీన్ని ఇప్పటికే నాలుగు దఫాలుగా అయిదు టన్నుల క్రషింగ్ సామర్థ్యం నుంచి 10,15,30 టన్నుల కు విస్తరించారు.ఇలా విస్తరిస్తూ పోయినా క్రషింగ్ సామర్థ్యం దెబ్బతింటుందని భావించి,రెండో పరిశ్రమ ఏర్పాటుకు మూడేళ్ల క్రితం ప్రకటన చేశారు.పాత పరిశ్రమ నుంచి దక్షిణం వైపు జాతీయ రహదారి వరకూ ఉన్న పామాయిల్ నమూనా క్షేత్రాన్ని  తొలగించారు. 2023లో రూ.40 కోట్లతో 2.5 మెగావాట్ల పవర్ ప్లాంటు పనులు చేపట్టి, 2024 లో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు,రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లు  సమక్షంలో ప్రారంభించారు.అయితే నూతన పరిశ్రమ నిర్మాణంలో ఇసుమంత పురోగతి లేదు.

ఇబ్బందులు ఏమిటి?

30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో నడుస్తున్న పరిశ్రమలో తరుచూ సాంకేతిక వైఫల్యాలు కలుగుతూ యంత్ర పరికరాలు కన్వేయర్ బెల్టులు తరచూ తెగి పోతున్నాయి. క్రషర్,నట్ డ్రం,బకెట్ ఎలివేటర్లు మరమ్మతులకు గురవుతున్నాయి.గంటల తరబడి పరిశ్రమలో గానుగ నిలిచిపోతుంది.సీబీసీ (కేక్ బ్రేక్ కన్వేయర్) లో లోపాలు తలెత్తడంతో క్రషింగ్ నిలిచిపోయి,గంటల తరబడి గెలల ట్రాక్టర్లు బారులు తీరడంతో రైతులు అవస్థలు పడుతున్నారు.ప్రస్తుత పరిశ్రమ నే కొనసాగిస్తే వచ్చే ఏడాది గంటకు 18 టన్నులు కూడా గానుగ ఆడే పరిస్థితి ఉండదని పలువురు నిపుణులు ఆవేదన చెందుతున్నారు.

అంతేకాదు దమ్మపేట పామాయిల్ పరి శ్రమ 90 టన్నుల సామర్థ్యం కాగా అక్కడా సాగు అధికంగానే పెరిగింది.కొత్త పరిశ్రమ నిర్మాణమే శాశ్వత పరిష్కారం అని రైతులు వాదిస్తున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పామాయిల్ సాగు ముదురు తోటల విస్తీర్ణం 32819.95 ఎకరాలు కాగా,లేత తోటలు సాగు 44,510.5 ఎకరాలు విస్తీర్ణం సాగులో ఉంది.

మొత్తంగా నేటి వరకు 77,330 ఎకరాల్లో పామాయిల్ సాగులో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఎకరాల్లో తోటలు న్నాయి.ప్రస్తుతం 50 వేల ఎకరాల్లో గెలలు వస్తుండగా వచ్చే ఏడాది 2026 లో కొత్త తోటల నుంచి గెలలు గణనీయంగా పెరగనున్నొయి.ఈ ఏడాది అశ్వారావుపేట పరిశ్రమ లక్ష్యం 80 వేల టన్నులు కాగా ఇప్పటికే 77 వేల టన్నుల గెలలు గానుగ ఆడాయి.రెండు నెలల్లో లక్ష టన్నుల కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. 2021, 22, 23 లో తోటల విస్తీర్ణం భారీగా పెరగడంతో వచ్చే ఏడాది నుంచి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad