Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటీపీసీసీ చీఫ్‌కు అభినందనల వెల్లువ

టీపీసీసీ చీఫ్‌కు అభినందనల వెల్లువ

- Advertisement -

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ పదవీబాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయన్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ దంపతులు, కార్పొరేషన్‌ చైర్మెన్లు నిర్మలా జగ్గారెడ్డి, మెట్టు సాయికుమార్‌, ఫయిమెద్దీన్‌, టీ శాట్‌ సీఈవో భోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తదితరులు కలిసి అభినందనలు తెలిపారు. పలువురు నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు కొప్పుల ప్రవీణ్‌, అల్లం భాస్కర్‌, చాంద్రాయనగుట్ట, బహదూర్‌పుర, చార్మినార్‌ నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు బోయ నగేష్‌, రాజేష్‌ కుమార్‌, ముజీఫ్‌ షరీఫ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ కోట్ల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వెంకటేష్‌ ముదిరాజ్‌ తదితరులు చార్మినార్‌ భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పేట్లబూర్జు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో బాలింతలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

రెండు, మూడు రోజుల్లో డీసీసీలను నియమిస్తాం
రెండు, మూడు రోజుల్లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ)లను నియమిస్తామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌ హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వాటర్స్‌లో ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జీలు, డీసీసీ అధ్యక్షులతో ఆయన ‘వన్‌ టు వన్‌’ చర్చించారు. ఏఐసీసీ సూచన మేరకు జిల్లా కమిటీల కూర్పు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -